Renu Desai : రేణు దేశాయ్ రెండో భ‌ర్త గురించి ఈ సంగ‌తి తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: May 29, 2022, 1:30 pm

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి చాలా ద‌గ్గ‌రగా ఉంటున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత రేణూ త‌న పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ కాలం గ‌డిపేస్తుంది. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రేణు. జానీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. పవన్ కళ్యాన్‌తో పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత విడుకులతో ఆమె కొన్నాళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. కొన్నేళ్ల నుంచి కూడా రేణు దేశాయ్ నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ మ‌ధ్య కాలంలో రేణు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ యాక్టింగ్ మాత్రం చేయ‌లేదు. అయితే ఇప్పుడు తాజాగా రేణు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.

చాలా ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్న రేణు గత ఏడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అతడితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసిన రేణు అతడి చేతికి ఉన్న రింగ్ ను చూపించేలా ఫోటో పెట్టింది. అయితే ఇప్పటికీ రేణు రెండో పెళ్లిపై క్లారిటీ లేదు. గ‌తేడాది సరదాగా ఆలీతో షో కి వచ్చిన రేణుదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడ‌ని… ముందు అత‌డు అమెరికాలో ఉద్యోగం చేసే అతడు వాళ్ళ తండ్రికి ఆరోగ్యం స‌రిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది.

Renu Desai About Her Second husband

Renu Desai About Her Second husband

Renu Desai : రెండో భ‌ర్త ఎవ‌రు?

రెండో పెళ్లి పై చాలా రోజుల పాటు తాను ఆలోచన చేశానని… అయితే తన కోసం… తన పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోక త‌ప్ప‌డం లేదని ఓ సందర్భంలో ప్రస్తావించింది. రేణు దేశాయ్ పాల్గొన్న అదే షోలో రేణుకి కాబోయే రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించాడు. అత‌డు రేణును ఆకాశానికి ఎత్తేయడంతో పాటు తన జీవితం ఎంతో సంతోషంగా ఉండటానికి కారణం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు.. అయితే ఇప్పటివరకు రేణు రెండో భర్త ఎవరు ?అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటన చేసిన వెంటనే విమర్శించిన పవన్ అభిమానులు… ఇటీవల తమ పిల్లల కోసం రేణు – పవన్ కలిసినప్పుడు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp