Renu Desai : రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ లో చేరతారు..?
ప్రధానాంశాలు:
Renu Desai : రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ లో చేరతారు..?
Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ మరోసారి రాజకీయ ప్రస్తావనతో వార్తల్లోకి వచ్చారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రేణు, తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా అందరికీ ప్రకటిస్తానని, దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కుటుంబ కారణాల వల్ల వదులుకున్నానని చెప్పిన రేణు, ఇప్పుడు సేవ చేసే తాపత్రయం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణానికి తాను తగనని అభిప్రాయపడుతున్నారు.

Renu Desai : రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ లో చేరతారు..?
Renu Desai రాజకీయాల్లోకి రేణుదేశాయ్..మరి ఏ పార్టీ లో చేరుతుందో..?
ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నేతగా బలంగా నిలిచిన నేపథ్యంలో, ఆయన మాజీ భార్య రాజకీయ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రేణు రాజకీయాల్లోకి వస్తే, ఆమె ఏ పార్టీతో ఉంటారు? పవన్‌కు ప్రత్యర్థిగా మారతారా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రేణు దేశాయ్ స్పష్టం చేసినట్లుగా, తన ఎంట్రీ అయితే తప్పకుండా ఖచ్చితంగా వెల్లడిస్తానని, తాను ప్రజలకు సేవ చేయడంలో ఆనందం పొందుతానని మాత్రమే చెప్పారు. ఇది ఒక రాజకీయ ఎంట్రీపై సంకేతమా లేదా సాధారణ వ్యక్తిగత అభిప్రాయమా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.
అలాగే రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ సినిమా రంగ ప్రవేశం గురించి వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజీ” సినిమాలో అకీరా నటిస్తున్నాడని గత కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ వాటిని రేణు ఖండించారు. అకీరా సినిమాల్లోకి రావాలని అనుకుంటే, తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. తన కొడుకును స్క్రీన్ మీద చూడాలన్న తపన తనకే ఎక్కువగా ఉందని తెలిపినా, ఏదీ ఫోర్స్ చేయనని స్పష్టంగా చెప్పారు. దీంతో అకీరా నటనా రంగ ప్రవేశంపై వస్తున్న రూమర్లకు తాత్కాలికంగా చెక్ పడినట్టైంది.