Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యార‌న్న సుధాక‌ర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యార‌న్న సుధాక‌ర్..!

Pawan Kalyan : హీరోగా కమెడియన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం సుధాకర్. తెలుగు వాళ్లే కాదు తమిళ సినీ ప్రేమికులు కూడా సుధాకర్ నటన ని ఎంజాయ్ చేసిన వాళ్లే అంటే అతిశయోక్తి కాదు. తమిళంలో చాలా సినిమాల్లో హీరోగా చేసాడు. ఇక తెలుగులో ఆయన పండించిన హాస్య నటనకి థియేటర్స్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయాయి.తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ తో తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని ఏర్పాటు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యార‌న్న సుధాక‌ర్..!

Pawan Kalyan : హీరోగా కమెడియన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం సుధాకర్. తెలుగు వాళ్లే కాదు తమిళ సినీ ప్రేమికులు కూడా సుధాకర్ నటన ని ఎంజాయ్ చేసిన వాళ్లే అంటే అతిశయోక్తి కాదు. తమిళంలో చాలా సినిమాల్లో హీరోగా చేసాడు. ఇక తెలుగులో ఆయన పండించిన హాస్య నటనకి థియేటర్స్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయాయి.తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ తో తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి ట్రెండింగ్ లో ఉన్నాయి.

Pawan Kalyan : ప‌వ‌న్ రియాక్ష‌న్ అలా..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాక‌ర్‌ తన కెరియర్ గురించి, అలాగే తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు చిరంజీవి తో పాటు ఇతర హీరోలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నన్ను చాలా ఆప్యాయంగా అన్నయ్య అంటూ పిలిచేవారు.ఇక మా ఆవిడను వదినా అని ఎంతో ప్రేమగా పిలిచేవారని తెలిపారు. ఇక నాకు చిరంజీవి ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతేనని సుధాకర్ తెలిపారు.ఇక ఆయన ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాను ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని ఆ సమయంలో పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని సుధాకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యార‌న్న సుధాక‌ర్

Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యార‌న్న సుధాక‌ర్..!

ఇక పవన్, సుధాకర్ లు గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి లో కలిసి నటించారు. ఆ మూడు కూడా ఘన విజయం సాధించాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం అందరకి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 600 సినిమాల దాకా చేసాడు. కొన్ని సినిమాలని కూడా నిర్మించాడు.. ఇండస్ట్రీకి దూరమైన సుధాకర్ మరణించారు అంటూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారి నేను బ్రతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి సుధాకర్ కి ఎదురైంది.ఇకపోతే ఇటీవల తన కుమారుడు బెన్నీ సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈయన కూడా పలు బుల్లితెర కార్యక్రమాలకు అలాగే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది