Student : పిల్లలకు స్కూల్ తప్పించడం అంటే ఎంతో ఇష్టం. ఏవో కారణాలు చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టేద్దామని చూస్తారు. ఆరోగ్యం బాగున్నా సరే కాలు నొప్పి, కడుపునొప్పి అని చెప్పి స్కూల్ కి ఎగనామం పెడతారు. అయితే ఒక అమ్మాయి మాత్రం స్కూలుకు హాజరయ్యే విషయంలో రికార్డ్ లను ఏర్పరచింది. ఇంతకీ ఎవరా అమ్మాయి ఏంటా కథ అన్నది చూస్తే. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్ వలీ కార్డ్ డ్రైవర్ గా చేస్తుంటాడు. అతను కేరళకు చెందిన షీభాను పెళ్లి చేసుకున్నాడు. 2017 లో ఈ ఇద్దరి దంపతులకు ఒక పాప జన్మనించ్చింది. ఐతే ఆమె పేరు అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అని పేరు పెటారు. పాప పుట్టే టైం కు ఐదున్నర నెలలే కావడంతో ఆమెను మూడున్నర ఏళ్ల దాకా ఒక ప్రత్యేకమైన రూంలోనే ఉంచారట.
అంతేకాదు పుట్టినప్పుడు ఆమె బరువు కేవలం 500 గ్రాములే ఉందట. అయినా సరే పాపను కటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారట. అందుకోసం వారికి దాదాపు పాతిక లక్షల దాకా ఖర్చు అయినట్టు తెలుస్తుంది.ఆరోగ్యం కుదుట పడ్డాక ఆ పాపకు ఐదేళ్లు రాగానే కేరళలోని ఒక స్కూల్ లో ఎల్.కె.జి లో జాయిన్ చేయించారట. స్కూల్ లో నిత్యం మాస్క్ ధరించి ఉంటూ ఆ పాప శానిటైగర్ కూడా వేసుకుని చేతులు కడుక్కుంటుందట. ఇతర విద్యార్ధులకు దూరంగా కూర్చుకుంటుందట. ఇప్పుడు ఆ పాప వయసు 7 ఏళ్లు.
ఐతే 2023-24 లో 197 రోజూ క్లాసులు జరగగా అన్ని రోజులూ స్కూల్ కు హాజరైంది ఆ పాప. ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా వెళ్లినందుకు ఆమెకు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకె ఇంకా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. స్కూల్ కి తప్పించాలనుకునే వారికి ఈ పాపని చూసైనా స్పూర్తి పొంది క్రమం తప్పకుండా స్కూల్ కి వెళ్తారేమో చూడాలి.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.