Home » Entertainment » Renu Desai Ok To Work With Chiranjeevi Movie
Entertainment

Chiranjeevi : ఆ సినిమాను చిరంజీవి ఒప్పుకుని ఉంటే రేణు దేశాయ్ నటించేదా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 5, 2022, 10:00 pm
Advertisement

Chiranjeevi : చాలా సంవత్సరాల క్రితం సువార్ట్‌ పురం పోలీస్ స్టేషన్ పరిధి లో లో టైగర్ నాగేశ్వరరావు అనే ఒక దొంగ అత్యంత చలాకీగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపించే వాడిని సమాచారం. అతడిని కొందరు దేవుడు అనే వాడు.. కొందరు దొంగ అనేవారు. కానీ అతడు తాను దోచుకున్న దానిలో ఎక్కువ శాతం పేదలకు పంచిపెట్టేవాడు అంటూ స్వయంగా పోలీసులు చెబుతూ ఉంటారు. అందుకే టైగర్ నాగేశ్వరరావు అంటే చాలా మందికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ అభిమానంతోనే వంశీ అనే దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ కథ చాలా మంది హీరోల వద్దకు తిరిగి చివరకు రవితేజ వద్దకు వచ్చి ఆగింది.

Advertisement

ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి అది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు అయిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు వంశీ తన వద్దకు వచ్చి ఈ కథ చెప్పాడని చిరంజీవి చెప్పుకొచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఈ సినిమాను చేయలేక పోయాను. తమ్ముడు రవితేజ ఈ సినిమాకు కమిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

renu desai ok to work with chiranjeevi movie

Advertisement

టైగర్ నాగేశ్వరరావు సినిమా లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ఒకవేళ టైగర్ నాగేశ్వరరావు సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే దర్శకడు వంశీ రిక్వెస్ట్ మేరకు చిరంజీవి తో కలిసి రేణు ఈ సినిమాలో నటించేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి కనుక టైగర్ నాగేశ్వరరావు సినిమా కమిట్ అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. రేణు దేశాయ్ ని వెండి తెరపై మళ్లీ చూడటానికి మనకు ఇంకాస్త సమయం పట్టేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో రేణు దేశాయ్ నటించడం దాదాపుగా అసాధ్యం కనుక రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా లో మాత్రమే నటించేది. మరే హీరో నటించిన కూడా ఆమె నో చెప్పేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి