Sai Dharam Tej Niharika : ఇంట్రెస్టింగ్ బజ్.. చిరంజీవి సినిమాలో మెరవనున్న సాయి తేజ్, నిహారిక..!
ప్రధానాంశాలు:
Sai Dharam Tej Niharika : ఇంట్రెస్టింగ్ బజ్.. చిరంజీవి సినిమాలో మెరవనున్న సాయి తేజ్, నిహారిక..!
Sai Dharam Tej Niharika : ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలతో కలిసి సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ చేస్తే అది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో చిరంజీవి Chiranjeevi ఇప్పుడు మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నారట.

Sai Dharam Tej Niharika : ఇంట్రెస్టింగ్ బజ్.. చిరంజీవి సినిమాలో మెరవనున్న సాయి తేజ్, నిహారిక..!
Sai Dharam Tej Niharika క్రేజీ న్యూస్..
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ Sai Dharam Tej అలియాస్ సాయి దుర్గా తేజ్ ఓ స్పెషల్ రోల్ లో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి న్యూస్ అందుతోంది. తేజ్ సెట్స్ లో జాయిన్ అయినట్లుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే చిరు ఇంట్రడక్షన్ సాంగ్ లో సాయి తేజ్ కనిపించే అవకాశం ఉంది. సాయి దుర్గ తేజ్ తో పాటు నిహారిక కూడా ఆ సాంగ్‌లో మెరవనుందని టాక్.
‘విశ్వంభర’ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయింది. రెండు సాంగ్స్, కొంత మేర ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా కూడా వెల్లడించారు.రీసెంట్‌గా పోస్టర్ విడుదల చేయగా ఇందులో చిరు జీప్ డోర్ ఓపెన్ చేస్తూ కనిపించారు. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా ఉన్నారు.