Ram Gopal Varma : నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తా.. నీకేంట్రా నొప్పి.. మళ్లీ గెలికేశాడు ఆర్జీవీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ram Gopal Varma : నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తా.. నీకేంట్రా నొప్పి.. మళ్లీ గెలికేశాడు ఆర్జీవీ

Ram Gopal Varma : ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ.. ఈ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్లు ఇంకో ఇద్దరో ముగ్గురో ఉంటే ఇండస్ట్రీ ఇలా ఉండదు. ఆర్జీవీ మాట్లాడే మాటలు కానీ.. ఆయన ఆలోచించే విధానం కానీ.. అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఎంత కొత్తగా అంటే.. రామ్ గోపాల్ వర్మ అసలు ఇలా కూడా ఆలోచిస్తారా? ఇలాంటి ఆలోచనలు మనకెందుకు రావు అనేంతగా ఉంటాయి. అందుకే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 October 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  నాకు బలమైన మగాళ్లు అంటే ఇష్టం

  •  నాకు అందమైన ఆడవాళ్లు అంటే ఇష్టం

  •  ఆ రెండు కలిస్తేనే అప్సర రాణి

Ram Gopal Varma : ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ.. ఈ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్లు ఇంకో ఇద్దరో ముగ్గురో ఉంటే ఇండస్ట్రీ ఇలా ఉండదు. ఆర్జీవీ మాట్లాడే మాటలు కానీ.. ఆయన ఆలోచించే విధానం కానీ.. అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఎంత కొత్తగా అంటే.. రామ్ గోపాల్ వర్మ అసలు ఇలా కూడా ఆలోచిస్తారా? ఇలాంటి ఆలోచనలు మనకెందుకు రావు అనేంతగా ఉంటాయి. అందుకే ఆర్జీవీ ఇండస్ట్రీలో స్పెషల్ పర్సన్ అయ్యారు. ఆర్జీవీ గురించి ఈ తరం వారికి తెలిసింది కేవలం యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూలు చూసి. కానీ.. 80, 90 దశకాలకు చెందిన వాళ్లను అడిగితే చెబుతారు. ఆర్జీవీకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో. ఆయన క్రేజ్ ఇప్పుడు తగ్గింది కానీ.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇక.. అసలు విషయానికి వస్తే.. అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించిన తలకోన అనే సినిమా ట్రెయిలర్ లాంచ్ కి డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే.. నేను అసలు మంచి సినిమాలు తీయడానికి రాలేదు అని. నేను ఏమంటున్నాను అంటే.. అసలు నేను నిజంగానే మంచి సినిమాలు తీయడానికి రాలేదు. కానీ.. కొన్ని మంచి సినిమాలు అయ్యాయి. ఫస్ట్ నుంచి బలమైన మగవాళ్లు, అందమైన ఆడవాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. బలమైన మగవాళ్లు అంటే యాక్షన్, అందమైన అంటే బ్యూటీ. ఈ తలకోన సినిమాలో అప్సర రాణి.. బలమైన యుద్ధాలు కూడా అప్సర చేసింది. అందమైన అమ్మాయి కూడా అప్సర. అంటే ఈ రెండు కలిపితే అప్సర కనిపించింది నాకు. ఒక దట్టమైన అడవిలో తలకోన సినిమా నేపథ్యం నడుస్తుంది కాబట్టి.. నాకు అడవి అంటే చాలా ఇష్టం.. అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

Ram Gopal Varma : తలకోన టైటిల్ ఉందని అందరూ జంతువుల్లా అరుస్తున్నారా?

తలకోన మూవీ ట్రెయిల్ లాంచ్ లో వర్మ జోక్స్ కూడా వేశాడు. తలకోన టైటిల్ ఉందని అందరూ జంతువుల్లా అరుస్తున్నారా? అంటూ వర్మ పంచులు పేల్చాడు. ఈ సినిమా సక్సెస్ సాదించాలని.. ఈ సినిమాలో అప్సర చాలా బ్యూటిఫుల్ గా ఉందని.. తన వల్లనే ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉందని ఆర్జీవీ స్పష్టం చేశారు. అప్సర నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ అప్సరకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆర్జీవీ ఆశాభావం వ్యక్తం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది