Richa : హీరోని చెప్పుతో కొడ‌తానంటూ వార్నింగ్ ఇచ్చిన రిచా.. అందుకే ఆఫ‌ర్స్ రావ‌డం లేదా?

Authored By Sam C | The Telugu News | Published on: September 19, 2022, 9:30 pm

Richa : రిచా గంగోపాధ్యాయ్.. చేసింది కొన్ని సినిమాలే అయిన త‌క్కువ టైంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. రవితేజ మిరపకాయ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. అంతకంటే ముందు లీడర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆమెకు మంచి గుర్తింపు అందించింది మాత్రం మిరపకాయ్ సినిమానే. హరిష్ శంకర్ రవితేజ కలయికలో వచ్చిన సినిమాలో ఆమె ట్రెడిషనల్ అమ్మాయిగా చాలా బ్యూటిఫుల్ గా కనిపించి మెప్పించింది.న్యూఢిల్లీకి చెందిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది.

Richa : ఇది అస‌లు కార‌ణ‌మా?

యూఎస్ఏ లోనే మిస్ ఇండియాకి కూడా పోటీ చేసింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సొంతం చేసుకుంది. మంచి సినిమా ఆఫర్స్ వ‌స్తున్నా కూడా సినిమాలకు గుడ్ బాయ్ అంటూ ప్రకటించేసి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయింది. అయితే దానికి కారణం చ‌దువు అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ అది మెయిన్ రీజన్ కాదు అంటూ తెలుస్తుంది. ఈమె నటించిన హీరోలలో ఓ హీరో ఆమెతో మిస్ బిహేవ్ చేసినట్లు ..ఆ కారణంగానే ఆమె అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఆ స్టార్ హీరో రిచాని ఇండ‌స్ట్రీలో లేకుండా చేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Richa Gangopadhyay About a hero That She Will Beat Him With Her Footwear

Richa Gangopadhyay About a hero That She Will Beat Him With Her Footwear

ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో స్టార్ హీరో కార్ వ్యాన్‌లో రిచాతో చాలా చెత్త‌గా బిహేవ్ చేశాడ‌ట‌. చెప్పుతో కొడ‌తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింద‌ట‌. దీంతో పాత ప్రైవేటు వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి మరి ఆమెను టార్చర్ చేశారట . ఇలాంటి బాధలు భరించలేకనే  సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తెలుగులోనే కాదు తమిళంలో కూడా శింబు, ధనుష్‌లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసింది రిచా.తన ఎంబీఏ ఫ్రెండ్ జోయీ లంగెళ్లను వివాహం చేసుకున్న రీచా 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Also read

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp