Bigg Boss 5 Telugu : బ్రోకర్ కాజల్.. ఆర్జేను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 9, 2021, 6:50 pm

Bigg Boss 5 Telugu :  బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో చేసే ప్రతీ ఒక్క పనిని జనాలు బాగా చూస్తుంటారు. వారు చేసే పనులను బట్టే ఇమేజ్ పెరుగుతుంది.. లేదా.. డ్యామేజ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఆర్జే కాజల్ మాత్రం ఓ రేంజ్‌లొ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఆర్జే కాజల్‌ను బ్రోకర్ అంటూ ఆడేసుకుంటున్నారు. ఓ మాట్రిమోని పెట్టుకో, బయటకు వచ్చాక బ్రోకరేజ్ చేసుకో అంటూ నెటిజన్లు దారుణంగా తిడుతున్నారు.

RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu

RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu

ప్రతీ ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్లడం.. పెళ్లి గురించి ప్రేమ గురించి మాట్లాడటం చేస్తోంది. మొదటగా లహరిని పట్టుకుంది. ఎలాంటి అబ్బాయి కావాలి.. ఇక్కడ ఎవరైనా నచ్చారా? అంటూ అడిగింది. ఆ తరువాత శ్రీరామ చంద్ర దగ్గరకు వెళ్లింది. నీకు ఎలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలంటూ అడిగింది. ఇక ప్రియాంక సింగ్ మానస్ మధ్యలో కూడా ట్రాక్ ఏర్పాటు చేయాలని బాగానే పరితపిస్తోంది.

RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu

RJ Kajl Is Gets Trolled In Bigg Boss 5 Telugu

బ్రోకర్ కాజల్.. ఆర్జేను ఏకిపారేస్తున్న నెటిజన్లు

నిన్నటి ఎపిసోడ్‌లోనూ కాజల్ ఇదే పని చేసింది. శ్రీరామచంద్రను పెళ్లి, ప్రేమ గురించి అడిగింది. యాంకర్ రవి చేసిన ఇమిటేషన్ గురించి మానస్ దగ్గర ప్రస్తావించి మళ్లీ ప్రియాంక టాపిక్ వచ్చేలా చేసింది. దీంతో ఆర్జే కాజల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈమె బిగ్ బాస్ ఇంట్లోకి ఆట ఆడేందుకు వెళ్లలేదేమో.. ఇలా బ్రోకరేజ్ చేసేందుకు వెళ్లి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp