Robinhood Movie : వార్నర్ వచ్చిన రాబిన్ హుడ్‌కి కలిసి రావడం లేదేంటి.. దారుణంగా బుకింగ్స్
Robinhood Movie : నితిన్, శ్రీలీల జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ “రాబిన్ హుడ్ చిత్రం Robin hood Movie వెంకీ కుడుముల దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. అయితే చిత్రానికి మాత్రం ఓపెనింగ్స్ దారుణంగా వచ్చేలా అనిపిస్తుంది.

Robinhood Movie : వార్నర్ వచ్చిన రాబిన్ హుడ్‌కి కలిసి రావడం లేదేంటి.. దారుణంగా బుకింగ్స్
Robinhood Movie ఇంత దారుణం ఏంటి ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కూడా ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. బుక్ మై షో లో ఇప్పటి వరకు ట్రెండింగ్ కి నోచుకోలేదు . సినిమాకి అడ్డాగా నిలిచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక్క షో కూడా హౌస్ ఫుల్ అవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పుష్ప 2’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకి బుకింగ్స్ ఇంత దారుణంగా ఉన్నాయేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు.
‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల కథానాయికగా నటించింది. డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు, అదే విధంగా ‘అదిదా సర్ప్రైజ్’ పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇన్ని ఉన్నా ఎందుకు సినిమాకి బుకింగ్స్ కావడం లేదో అర్ధం కావడం లేదు. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది. నితిన్ పై గత సినిమాల ఎఫెక్ట్ గట్టిగా పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.