Rocket Raghava : జబర్దస్త్ మోస్ట్ సీనియర్ రాకెట్ రాఘవ పారితోషికం ఎంత?
Rocket Raghava : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై మరికొన్ని నెలల్లో 10 సంవత్సరాలు కాబోతుంది. ఈ పది సంవత్సరాల్లో జబర్దస్త్ కార్యక్రమం లో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఫస్ట్ ఎపిసోడ్లో జడ్జిలుగా నాగబాబు మరియు రోజాలు వ్యవహరించారు. నాగబాబు చాలా కాలం క్రితమే జబర్దస్త్ కార్యక్రమం నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక రోజా కూడా తాజాగా మంత్రి పదవి రావడం తో జబర్దస్త్ వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ జబర్దస్త్ కార్యక్రమానికి ఆమె వస్తుందా రాదా అనేది తెలియదు. ఇక యాంకర్లుగా అనసూయ మరియు రష్మి గౌతమ్ వ్యవహరిస్తున్నారు.
మొదటి ఎపిసోడ్ యాంకర్ అనసూయ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికీ కూడా కొనసాగుతోంది జబర్దస్త్ మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న వారిలో అనసూయ తో పాటు రాకెట్ రాఘవ కూడా ఉన్నారు. అనసూయ మధ్యలో వెళ్లి పోయి మళ్లీ వచ్చింది. కానీ రాకెట్ రాఘవ మాత్రం కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉన్నారు. మరే టీం లీడర్ కు దక్కని అరుదైన సీనియారిటీ గౌరవం రాఘవకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. మల్లెమాల వారితో ఆయనకు ఎలాంటి విషయాల్లో విభేదాలు ఉండవని.. ఆయన అన్ని విషయాలను కూడా నార్మల్ గా తీసుకొని ముందుకు వెళ్లడం వల్ల ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఇక మల్లెమాల వారు పారితోషికం విషయంలో చాలా పిసినారులుగా వ్యవహరిస్తారు అనే టాక్ ఉంది.

Rocket Raghava remuneration for jabardast show
అలాంటి వారితో రాకెట్ రాఘవ ర్యాపో ఎలా ఉంది అనేది అందరికీ ఆసక్తి గా ఉంది. అసలు రాకెట్ రాఘవ కి మల్లెమాల వారు ఎంత పారితోషికం ఇస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. బుల్లి తెర వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాకెట్ రాఘవ ఎపిసోడ్కి రూ.1.25 లక్షల పారితోషికాన్ని అందుకుంటాడట. అందులో ఖర్చులు పోను లక్ష రూపాయల వరకు మిగులుతాయని తెలుస్తోంది. టీమ్ మెంబర్స్ కి మల్లెమాల వారు పారితోషికం ఇవ్వగా.. ఆయన కూడా కొంత మొత్తంలో తన టీమ్ మెంబర్స్ కి ఇస్తాడు. తద్వారా ఆయనకు ఎపిసోడ్కి లక్ష రూపాయల వరకు మిగులుతుందని సమాచారం. ఇతర టీమ్ లీడర్లకు కంటెస్టెంట్స్ కి ఇంతకు మించి భారీ పారితోషికం ఉంటుంది. కానీ రాకెట్ రాఘవ మాత్రం చాలా తక్కువ పారితోషికాన్ని తీసుకుంటారని వారు చెబుతున్నారు.