Jabardasth Varsha : అమ్మాయో అబ్బాయో తెలియడం లేదు.. వర్షను కించపరిచిన రాఘవ కొడుకు
Jabardasth Varsha : బుల్లితెరపై రాఘవ కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెండితెరపై సినిమాల్లో కనిపిస్తూ నవ్వించేవాడు. ఆ తరువాత జబర్దస్త్ షో పుణ్యమా అని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాడు. జబర్దస్త్ షో మొదలు పెట్టినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా కనిపిస్తూ వచ్చాడు. అలా మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్‌గా జబర్దస్త్ షోలో బాగా పాతుకుపోయాడు.ఇక ఈ మధ్య అయితే రాకెట్ రాఘవ కంటే అతని కొడుకు మురారి ఎక్కువగా ఫేమస్ అవుతున్నాడు.
ఆ మధ్య అయితే మురారి పంచులకు జడ్జ్‌లు సైతం ఆశ్చర్యపోయేవారు. పండుగ ఈవెంట్లు, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో మురారి స్పెషల్ ఎంట్రీలు ఇచ్చేవారు. మురారి కామెడీ టైమింగ్‌ను చూసి అందరూ ముచ్చట పడేవారు. అందుకే అతడిని ఏరి కోరి మరీ స్కిట్లో పెట్టుకునేవారు.ఇక మురారి వేసే పంచులు, దానికి సుధీర్ బలయ్యే తీరు, పొట్టి నరేష్‌ను ఆడుకునే తీరు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటుంది. అయితే తాజాగా చాలా గ్యాప్ తరువాత మురారి జబర్దస్త్ షోలో కనిపించాడు.

Rocket Raghava Son Murari On Varsha in Extra Jabardasth
అది కూడా వర్షకు తండ్రిలా నటించాడు. తలా ఒకరు వచ్చి తమ కూతురు గురించి పరిచయం చేస్తూ వచ్చారు. ఇక మురారి వంతు వచ్చే సరికి వర్షను దారుణంగా కించపరిచేశాడు.అసలు ఇది అమ్మాయో అబ్బాయో నాకు తెలియడం లేదు అని చెబుతాడు మురారి. దీంతో వర్ష మొహం మాడిపోతుంది. అసలే ఆ మధ్య ఇమాన్యుయేల్ ఇలానే స్కిట్లో కౌంటర్లు వేస్తే ఏడుస్తూ నానా రచ్చ చేసి స్టేజ్ దిగి వెళ్లిపోయింది.
