Roja Jeevitha : రోజా, జీవిత వాగ్వాదం.. తెరపైనే ఆదిపత్య పోరాటం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja Jeevitha : రోజా, జీవిత వాగ్వాదం.. తెరపైనే ఆదిపత్య పోరాటం

 Authored By prabhas | The Telugu News | Updated on :31 March 2022,9:31 pm

Roja Jeevitha : బుల్లితెరపై రోజా, జీవిత ఇద్దరూ కూడా తమ తమ మార్క్ క్రియేట్ చేశారు. బతుకు జట్కా బండి అంటూ జీవిత తన ముద్ర వేస్తే.. రచ్చ బండ అంటూ రోజా మరింతగా రెచ్చిపోయింది. ఇద్దరూ కూడా తమ తమ స్టైల్లో ఆ షోలను రక్తి కట్టించారు. ఇక జీవిత కాస్త సౌమ్యంగా డీల్ చేస్తే రోజా మాత్రం కొట్టేందుకు వెళ్లిపోయేది. అలా ఈ ఇద్దరూ చేసిన ఈ షోలు బాగానే క్లిక్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే ఈవెంట్‌లో కనిపించారు. ఉగాది సందర్భంగా రాబోతోన్న అంగరంగ వైభవంగా అనే ఈ ఈవెంట్‌లో రోజాతో పాటుగా జీవిత, రాజశేఖర్ ఇద్దరూ కూడా వచ్చారు. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా.. శేఖర్ అనే చిత్రం రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ ఇద్దరూ ఈ ఈవెంట్‌కు వచ్చారు.

Roja And Jeevitha In Anagaranga Vaibhavanga Event In ETV

Roja And Jeevitha In Anagaranga Vaibhavanga Event In ETV

Roja Jeevitha : జీవితను లేపేసిన రోజా..

అయితే వీరంతా కలిసి ఓ స్కిట్ వేశారు. బతుకు జట్కా బండిలాంటి స్కిట్‌ను స్పూప్ వేశారు. అయితే ఇందులో జీవిత న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఆ సీట్‌లో కూర్చుంది. కానీ రోజా కన్ను మాత్రం ఆ సీట్ మీదే పడింది. అది నా సీట్ అని రోజా తన ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. చివరకు జీవితను అక్కడి నుంచి లేచేలా చేసింది. చివరకు రోజా కూర్చుంది.

YouTube video

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి