Roja : 11 ఏళ్ల పాటు ప్రేమించుకున్న రోజా – సెల్వ‌మ‌ణి.. హాట్ టాపిక్‌గా మారిన ప్రేమ క‌హానీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : 11 ఏళ్ల పాటు ప్రేమించుకున్న రోజా – సెల్వ‌మ‌ణి.. హాట్ టాపిక్‌గా మారిన ప్రేమ క‌హానీ

 Authored By sandeep | The Telugu News | Updated on :14 August 2022,6:40 pm

Roja : రోజా.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల‌లో తెలియ‌ని వారు లేరు. ఈమె అసలు పేరు శ్రీ లతా రెడ్డి. ఈమె 1972 నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు ఉమ్మడి ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి జన్మించారు. ఆ సినిమాల్లోకి రాకముందు తన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించింది.కథానాయికగా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. ఈ చిత్రాన్ని దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ డైరెక్ట్ చేసారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో హీరో కూతురు పాత్రలో రోజా అలరించింది. ఈ సినిమా సక్సెస్‌తో రోజా వెనుదిరిగి చూసుకోలేదు.

Roja : 11 ఏళ్ల ప్రేమ‌..

సినిమాల‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త‌ర్వాత రోజా టీవీ షోలకి జ‌డ్జిగా కూడా వ్య‌వ‌హ‌రించింది. ఇక మంత్రిగా ప్ర‌మోష‌న్స్ అందుకున్న త‌ర్వాత వెండితెర‌, బుల్లితెర‌కు పూర్తిగా దూరంగా ఉంది. ఈమె ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే వీరి పెళ్లి అంత సుల‌భంగా ఏమీ జ‌ర‌గ‌లేదు. `చెంబురతి` మూవీతో రోజా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీని సెల్వమణినే తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా స‌మ‌యంలోనే సెల్వమణి, రోజా మ‌ధ్య స్నేహం ఏర్ప‌డ‌గా.. ఆ స్నేహం ప్రేమ‌కు దారి తీసింది.

Roja And Selvamani Loved 11 Years Each Other

Roja And Selvamani Loved 11 Years Each Other

రోజా.. సెల్వ‌మ‌ణిని పెళ్లి చేసుకునేందుకు 11 ఏళ్లు ప‌ట్టింద‌ట‌. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్‌ల‌ను వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. అందుకే ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో త‌న అన్న‌ద‌మ్ముల‌ను సెటిల్ అయ్యేలా చేయాల‌ని భావించింద‌ట రోజా. అందులో భాగంగానే `సమరం` అనే చిత్రాన్ని తెలుగు మ‌రియు తమిళ భాషల్లో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర‌య్యాయ‌ట‌. రోజా అనేక సార్లు షూటింగ్ లో గాయ‌ప‌డింది. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత ప‌లు న‌ష్టాలు చ‌వి చూసింది. ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు 2002లో పెళ్లి చేసుకోగా.. ఈ దంప‌తుల‌కు అన్షు మాలిక, కృష్ణ లోహిత్ ఉన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది