Roja : రోజా.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు లేరు. ఈమె అసలు పేరు శ్రీ లతా రెడ్డి. ఈమె 1972 నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు ఉమ్మడి ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి జన్మించారు. ఆ సినిమాల్లోకి రాకముందు తన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించింది.కథానాయికగా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. ఈ చిత్రాన్ని దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ డైరెక్ట్ చేసారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో హీరో కూతురు పాత్రలో రోజా అలరించింది. ఈ సినిమా సక్సెస్‌తో రోజా వెనుదిరిగి చూసుకోలేదు.
సినిమాలలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత రోజా టీవీ షోలకి జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక మంత్రిగా ప్రమోషన్స్ అందుకున్న తర్వాత వెండితెర, బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంది. ఈమె ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి పెళ్లి అంత సులభంగా ఏమీ జరగలేదు. `చెంబురతి` మూవీతో రోజా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీని సెల్వమణినే తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సమయంలోనే సెల్వమణి, రోజా మధ్య స్నేహం ఏర్పడగా.. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది.
రోజా.. సెల్వమణిని పెళ్లి చేసుకునేందుకు 11 ఏళ్లు పట్టిందట. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్‌లను వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. అందుకే ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో తన అన్నదమ్ములను సెటిల్ అయ్యేలా చేయాలని భావించిందట రోజా. అందులో భాగంగానే `సమరం` అనే చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయట. రోజా అనేక సార్లు షూటింగ్ లో గాయపడింది. ఈ సినిమా విడుదల తర్వాత పలు నష్టాలు చవి చూసింది. ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు కొంత కాలం వేచి చూడక తప్పలేదు. చివరకు 2002లో పెళ్లి చేసుకోగా.. ఈ దంపతులకు అన్షు మాలిక, కృష్ణ లోహిత్ ఉన్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.