Home » Entertainment » Roja Birthday Special Dhee Episode
Entertainment

Roja : ఎక్కడికెళ్లినా అదేనట!.. గుట్టు విప్పిన రోజా

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 11, 2021 5:18 pm
Advertisement

Roja : రోజా బుల్లితెరపై అందరిపైనా ఓ మార్క వేసింది. అది జబర్దస్త్ అయినా రచ్చ బండ అయినా కూడా రోజా తన స్టైల్లో నెట్టుకొచ్చేస్తుంది. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా బుల్లితెరను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆరోగ్యం బాగా లేకపోయినప్పుడు మాత్రమే షూటింగ్‌లకు గ్యాప్ ఇస్తుంటుంది.ఇక రాజకీయ సమావేశాలు ఉంటే అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటుంది. అయితే తాజాగా రోజా ఢీ సెట్‌లోకి అడుగు పెట్టేసింది. రోజా బర్త్ డే స్పెషల్‌గా కొన్ని పర్ఫామెన్స్‌లు ఇచ్చారు.

Advertisement

Roja Birthday Special Dhee Episode

రోజాకు చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో మరుపు రాని హిట్లు పడ్డాయి. మాస్ ప్రేక్షకులను రోజాకు దగ్గర చేసింది కూడా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలే. ముఠామేస్త్రీ, భైరవ ద్వీపం వంటి చిత్రాలు రోజా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచపోయేలా ఉంటాయి. అలా ఆ సినిమాల్లోంచి పాటలను ఎంచుకుని రోజాను గతంలోకి తీసుకెళ్లారు. మామా మామా అంటూ రోజా స్టైల్లో స్టెప్పులు వేశారు. దీంతో రోజా తెగ ఎంజాయ్ చేసింది. ఇక భైరవ ద్వీపం సినిమాలోని పాటకు కూడా స్టెప్పులు వేశారు.

Advertisement

Roja : పాటపై రోజా కామెంట్లు..

Roja And Indraja In Oorilo Vinayakudu

విరిసినది వసంత గానం అనే పాటకు రోజాలా స్టెప్పులు వేశారు. దీంతో రోజా గతంలోకి వెళ్లినట్టుంది. తాను తన నియోజక వర్గంలో ఎక్కడికి వెళ్లినా, ఏ పెళ్లికి వెళ్లినా, తన ఎంట్రీలో ఇదే పాటను వేస్తారంటూ విరిసినది అనే పాటకు ఉన్న విశిష్టతను వివరించింది రోజా. ఎంతైనా ఆ సినిమా, ఆ పాటలు, అందులో బాలకృష్ణ, రోజా నటన అలా నిలిచిపోతాయి. అందుకే ఇన్నేళ్లు అయినా కూడా పాటలు ఇంకా మార్మోగిపోతూనే ఉన్నాయి. తన బర్త్ డేకు ఇంత కంటే మంచి గిఫ్ట్ ఇవ్వరూ ఇవ్వలేరంటూ రోజా ఎమోషనల్ అయింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి