Jabardasth Varsha : ఆ ఇద్దరూ షోకు బొక్కా?.. వర్ష ఇమాన్యుయేల్ పరువుతీసిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Varsha : ఆ ఇద్దరూ షోకు బొక్కా?.. వర్ష ఇమాన్యుయేల్ పరువుతీసిన రోజా

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2022,2:30 pm

Jabardasth Varsha : జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యుయేల్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. అయితే మధ్యలో కాస్త అతి చేయడంతో అంతా తారుమారైంది. పెళ్లి నాటకం ఆడుతూ ఓ ఈవెంట్ చేశారు. దీంతో జనాలు తిరగబడ్డారు.మల్లెమాలను, వర్ష ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఏకిపారేశారు. అయితే కొన్ని రోజులు ఈ లవ్ ట్రాక్, రొమాంటిక్ స్కిట్లకు దూరంగా ఉంటూ వచ్చారు.

మధ్యలో కొన్ని సార్లు ట్రాక్ తప్పారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్లో అన్నా చెల్లి అంటూ స్కిట్లు కూడా వేశారు.కానీ కొన్ని రోజుల తరువాత మళ్లీ మామూలుగానే తయారయ్యారు. జబ్దర్దస్త్ కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ దుమ్ములేపేస్తున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వచ్చింది. ఇందులో వర్ష, ఇమాన్యుయేల్‌లను అన్నాచెల్లెళ్లుగా మార్చేశారు.

v

Roja Humiliates Varsha And Emmanuel In Extra Jabardasth

Jabardasth Varsha : బొక్క అంటూ పరువుతీసిన రోజా

అయితే వర్ష, ఇమాన్యుయేల్ ఎంట్రీతో రోజా కౌంటర్ వేస్తుంటుంది. అసలే జడ్జ్‌లు ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చే స్కిట్లో భాగంగా ఆమని, లైలాలకు రోజా ట్రైనింగ్ ఇస్తుంటుంది. వర్ష ఇమాన్యుయేల్‌లు రాగానే సూపర్ అంటూ ఓ సింబల్ చూపిస్తుంటుంది. ఏంటి మేడం అలా అంటున్నారు అని ఆమని అంటుంది. ఆ ఇద్దరూ షోకు బొక్కా అని సింబాలిక్‌గా చూపిస్తున్నాను అంటూ పరువుతీసేస్తుంది రోజా.

YouTube video

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి