Roja : దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉన్న రోజాకి మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉన్న రోజాకి మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :17 September 2022,5:30 pm

Roja : టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన న‌టి రోజా. హీరోయిన్ గా, పొలిటీషియన్ గా.. బుల్లితెరపై నవ్వుల రేడుగా.. చాలా ఫేమ‌స్ అయింది. ప్రస్తుతం మినిష్టర్ గా ప్రమోషన్ సాధించిన రోజా.. వెండితెరకు దూరం అయ్యింది. మంత్రిగా బాధ్యతలు పెరగడం తో జబర్థస్త్ జడ్జిగా కూడా వదిలి వెళ్లింది. మొన్న‌టి వ‌ర‌కు ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన రోజా ఇప్పుడు మంత్రి అవ‌డం వ‌ల‌న బుల్లితెర‌కు కూడా దూరంగా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌ని ప‌ల‌క‌రిస్తుంది. అయితే రోజా ఇప్పుడు ఉన్న‌త స్థాయిలోనే ఉన్నా ఒక‌ప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన ప‌రిస్థితిని చ‌వి చూసింద‌ట‌.

Roja : ఆ షోతోనే దశ తిరిగిందా?

ఆఫర్స్ తగ్గిన స‌మ‌యంలో ఉన్న‌దంతా ఖ‌ర్చు చేసి నిర్మాత‌గా ప‌లు సినిమాలు తీసింద‌ట‌. అవ‌న్నీ బోల్తా కొట్ట‌డంతో రోజా న‌ష్టాల‌ని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. రోజా 2004, 2009 సంవత్సరాల్లో నగరి, చంద్రగిరి నియజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో రోజా ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఇక 2013 లో జబర్థస్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షో లో జడ్జి గా ఎంట్రీ ఇచ్చారు.ఇక అప్ప‌టి నుండి రోజా ద‌శ తిరిగిపోయింది. ఈ షో ద్వారా రోజా బాగానే సంపాదించింది. ఈ షోకి భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డంతో రోజా ఆర్ధిక ప‌రిస్థితి సెటిల్ అయింద‌ని అంటారు. రోజా తెలుగునాట ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. ఆమె ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. 1999 లో ఆమె రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ స‌మ‌యంలో టీడీపీలో ప‌ని చేసిన ఆమె.. త‌రువాత వైఎస్సార్ సీపీలో చేరారు.

Roja Life Was Settled With Jabardasth Show

Roja Life Was Settled With Jabardasth Show

ఆ పార్టీ త‌రుఫున న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. త‌రువాత వ‌చ్చిన 2019 ఎన్నిక‌ల్లో కూడా అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. మొద‌టి సారి టీడీపీ నేత గాలి ముద్ద‌కృష్ణ‌మ‌నాయుడిని, రెండో సారి ఆయ‌న కుమారుడు గాలి భానుప్ర‌కాశ్ ను చిత్తుగా ఓడించారు. 2014 ఎన్నిక‌ల కంటే ముందే వైసీపీలో చేరిన ఆమె మొద‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అండగా నిలిచారు. అసెంబ్లీలో వైసీపీ వాయిస్ ను వినిపించ‌డంలో కీల‌కంగా ప‌ని చేశారు. దీంతో ఆమె సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌న్నిహితురాలిగా మారారు. 2019 ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. సీఎం జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఇక ఎప్ప‌టి నుండో మంత్రి ప‌దవి కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన రోజా ఆ కోరిక కూడా తీర్చుకుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది