MAA Election : మా ఎల‌క్ష‌న్స్‌.. మా కంటే ఎక్కువ బూతులు తిట్టుకుంటున్నారు.. రోజా

Authored By praveen T | The Telugu News | Updated on : 10 October 2021, 3:40 pm

MAA Election :మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ హైదరాబాద్ జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరుగుతోంది. సినీ ప్రముఖులు ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఓటేసేందుకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

Roja Selvamani CoMMENTS On MAA Elections

Roja Selvamani CoMMENTS On MAA Elections

సాధారణ ఎన్నికల మాదరిగా మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా జరగుతున్నాయని చెప్పారు. లోకల్ నాన్ లోకల్ అనే అంశంపై స్పందించారు. ప్రజల యాక్సెప్టెన్స్‌ను బట్టి నాన్ లోకల్‌ వాళ్లు లోకల్ అయిపోతారని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి మా ప్యానెల్ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారని రోజా అన్నారు.

సీనియర్ యాక్టర్స్ చాలా మంది కాంట్రిబ్యూషన్ మా అభివృద్ధిలో ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల సందర్భంగా రెండు ప్యానెల్ సభ్యుల గురించి మాట్లాడారు. రెండు ప్యానెల్ సభ్యులు తనకు తెలుసని, వారితో తాను యాక్ట్ చేశానని పేర్కొన్నారు. మా ఎన్నికలలో రాజకీయ పార్టీల జోక్యం లేదని తెలిపారు.

 

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp