MAA Election : వీడిన ఉత్కంఠ.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

 Authored By praveen | The Telugu News | Updated on :10 October 2021,9:25 pm

MAA Election : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల యుద్ధం ముగిసింది. మా అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, విలక్షణ నటుడుప్రకాశ్ రాజ్ పోటీ పడగా, ఈ పోటీలో మంచు విష్ణు నెగ్గాడు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. లోకల్, నాన్ లోకల్ అనే అంశంతో పాటు మా సభ్యుల సంక్షేమం, మా భవనం ఇంకా పలు అంశాలు ఈ ఎన్నికల సందర్భంగా తెరమీదకు వచ్చాయి.

Finally MAA Elections are came out

Finally MAA Elections are came out

ఇకపోతే మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఫైనల్‌గా మంచు విష్ణు ప్యానెల్ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. విష్ణు ప్యానెల్ కు చెందిన ఎనిమిది మంది ఆల్రెడీ విజయం సాధించగా, ఫైనల్‌గా అధ్యక్షుడిగా విష్ణు ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కాసేపట్లో రానుంది. ఈ సారి మా ఎన్నికల్లో గతంలో లేనంత రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సినీ ప్రముఖులతో పాటు ఆర్టిస్టులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Finally MAA Elections are came out

Finally MAA Elections are came out

 

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి