Roja : కొడుకుతో రోజా ఊర మాస్ డాన్స్… ఏమన్న చేసారా… వీడియో!!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : కొడుకుతో రోజా ఊర మాస్ డాన్స్… ఏమన్న చేసారా… వీడియో!!!

 Authored By aruna | The Telugu News | Updated on :21 November 2023,10:35 pm

ప్రధానాంశాలు:

  •  Roja : కొడుకుతో రోజా ఊర మాస్ డాన్స్... ఏమన్న చేసారా... !!!

  •  తెలుగు నటి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పుట్టినరోజు వేడుక

Roja : తెలుగు నటి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పుట్టినరోజు వేడుక కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు Video సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి Chiranjeevi  వాల్తేరు వీరయ్య valtheru veerayya సినిమాలోని డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ పాటకు రోజా అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇదే వేడుకలో తన కొడుకుతో కలిసి ముక్కాల పాటకు కూడా డాన్స్ చేశారు. రోజా తన పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీస్ ప్రముఖ రాజకీయవేత్తలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి రోజా తన పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలను రోజా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో అభిమానులు బర్తడే విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. య బర్త్డే వేడుకల్లో మంత్రి రోజా వేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా Social Media లో వైరల్ గా మారింది. రోజా తన కుమారుడు లోహిత్ శల్వమణితో కలిసి ముక్కాల ముక్కబుల పాటకు ఆనందంగా చిందులేసారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల లోడింగ్ అంటూ పాటకు స్టెప్పులేసి బర్తడే పార్టీలో సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ Tollywood ని ఏలేశారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ఈమె అసలు పేరు శ్రీలత రెడ్డి. ఈమె నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2022లో జగన్మోహన్ రెడ్డి Ys Jagan MOhan reddy మంత్రివర్గంలో టూరిజం సాంస్కృతిక యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ప్రభుత్వంలో పర్యాటక క్రీడలు యువజన మంత్రిగా నియమితులయ్యారు. మంత్రి అయినందుకు ఇక మీదట టీవీ సినిమా షూటింగ్ లు చేయనని ఆమె ప్రకటించారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది