RRR Radheshyam : ఈగోలతో నిర్మాతలు.. మళ్లీ ఆర్ఆర్‌ఆర్, రాధేశ్యామ్ క్లాష్ తప్పదేమో
RRR Radheshyam : సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ మరియు రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. థర్డ్ వేవ్ ఉత్తర భారతంలో విజృంభించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల వాయిదా వేస్తున్నట్లుగా మొదట జక్కన్న టీమ్ ప్రకటించారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే రాధేశ్యామ్ సినిమా ను కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ రెండు సినిమాలు వాయిదా వేయడం మంచిది అయ్యిందని ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కారణంగా ఆంక్షలు అమలు అవుతున్నాయి. దాంతో థియేటర్లలో సినిమాలు ఆడటం కష్టంగా మారింది. అందుకే ఈ సినిమాలను వాయిదా వేసుకోవడం మంచిది అయ్యిందనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరి వరకు థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుతుంది. మార్చి మొదటి వారం మరియు రెండవ వారంలో కేసులు అనూహ్యంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ కేసులు మార్చి కి తగ్గుతాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాను మార్చి మూడవ లేదా నాల్గవ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విడుదల తేదీ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు కాని త్వరలోనే మార్చి లోనే సినిమా ఉంటుందని ప్రకటిస్తారని తెలుస్తోంది. రాధేశ్యామ్ ఆలోచనతో ఏకీభవించిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఇప్పుడు అదే మార్చిలో తమ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్ర యూనిట్ సభ్యులతో చర్చించి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారనే వార్తలు వస్తున్నాయి. మార్చి లో మేము వస్తామని జక్కన్న టీమ్ చెప్పినప్పటికి రాధేశ్యామ్ టీమ్ మాత్రం ముందు అనుకున్నట్లుగానే మేము ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారట.

RRR and Radheshyam movies again clash at box office with egos
రెండు సినిమాలు భారీ చిత్రాలే.. కనుక కనీసం ఈ రెండు సినిమాల మద్య రెండు వారాల గ్యాప్ ఉంటేనే రెండు సినిమాలకు కూడా మంచిది. అందుకే ఈ రెండు సినిమాల మద్య గ్యాప్ ఉంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఇరు చిత్రాల నిర్మాతలు కూడా ఈగోలకు పోయి మళ్లీ బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. మార్చి లో తప్పితే సినిమా విడుదలకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏప్రిల్ లో చాలా సినిమాలు విడుదల కు ఉన్నాయి. కనుక ఆ సినిమా లను తప్పుకోమని తమ సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. కనుక ఈ రెండు సినిమా లు మార్చిలోనే విడుదల చేయడం మంచి నిర్ణయం అన్నట్లుగా కొందరు భావిస్తున్నారు.