RRR Radheshyam : ఆర్ఆర్‌ఆర్, రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్స్… ‘లీడర్’ డైలాగ్ చెబుతున్న నెటిజన్స్
RRR Radheshyam : తెలుగు ప్రేక్షకుల తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మన టాలీవుడ్ లో రూపొందిన రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటిది టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమురం భీం మరియు అల్లూరి సీతారామరాజు గా నటించిన ఆ సినిమా గత మూడు సంవత్సరాలు గా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన సినిమా అవ్వడం వల్ల ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండేళ్లుగా సినిమా విడుదల తేదీని అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. మొన్న సంక్రాంతి ముందు ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
మళ్లీ ఇప్పుడు కొత్త విడుదల తేదీని రాజమౌళి అండ్ టీం ప్రకటించారు. మార్చి 25 వ తారీకున ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించిన నేపథ్యం లో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వం లో యు.వి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా ను కూడా సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు భారీ క్రేజీ సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.ఈసారి కచ్చితంగా ఈ సినిమాలు వస్తాయనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు.
RRR Radheshyam : ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్‌లతో మార్చిలో పండుగే..
అయితే ఈ సమయం లో కొందరు సినీ ప్రేక్షకులు మాత్రం రానా నటించిన లీడర్ సినిమా లోని ఒక డైలాగ్ ను చెబుతున్నారు. అదేంటి అంటే… ‘మాకు నమ్మకం లేదు దొర’. అవును.. ఈ రెండు సినిమాలు ఇప్పటికే చాలా సార్లు వాయిదాలు మీద వాయిదాలు పడ్డాయి కనుక ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో కొందరు ప్రేక్షకులకు మాత్రం ఇంకా నమ్మకం కలగడం లేదు. అందుకే వాళ్లు నమ్మకం లేదు అంటూ ఫన్నీగా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అంతగా నిరాసక్తత తో ఉండడానికి కారణం ఒక్కొక్క సినిమా మూడు నాలుగు సార్లు వాయిదా పడింది. అందుకే వాళ్లలో నమ్మకం సన్నగిల్లింది, కానీ ఈసారి కరోనా ఈ రెండు సినిమాలను అడ్డుకోక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి లో 2 సినిమా పండుగల తో అభిమానులు పండుగ చేసుకోవచ్చు.