RRR : ఆర్.ఆర్.ఆర్ నుంచి కంటెంట్ లీకయ్యే ఛాన్స్ .. టెన్షన్ పడుతున్న రాజమౌళి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR : ఆర్.ఆర్.ఆర్ నుంచి కంటెంట్ లీకయ్యే ఛాన్స్ .. టెన్షన్ పడుతున్న రాజమౌళి..?

 Authored By govind | The Telugu News | Updated on :23 February 2021,7:00 am

RRR : ఆర్.ఆర్.ఆర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్, ఓలివియా మోరీస్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ సహా పలువురు బాలీవుడ్..హాలీవుడ్ నటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

RRR content leak chances are thereRajamouli is in tension

RRR content leak chances are there…Rajamouli is in tension

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తో సహా 8 భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13 న భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా సరిగ్గా నెల రోజుల ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమా కి సంబంధించి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లోనే ఆర్.ఆర్.ఆర్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా .. ఒకవైపు నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నాడట రాజమౌళి.

అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాకి సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చిందట. ఈ సమస్య రాజమౌళి ని బాగా టెన్షన్ పెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయట. గ్రాఫిక్స్ వర్క్ డిపార్ట్మెంట్ లో చాలా మంది టెక్నీషియన్లు విదేశీయులు కావడం వల్ల ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ కి వారి కొరత ఎక్కువైందని సమాచారం. ఆన్ లైన్ లో వర్క్ చేద్దామంటే కంటెంట్ లీక్ అయ్యే సమస్యలు ఉండటంతో రిస్క్ చేయలేక అందుబాటులో ఉన్న టెక్నీషియన్లతోనే వర్క్ చేయిస్తున్నారట. ఈ కారణంగా ఆర్.ఆర్.ఆర్ గ్రాఫిక్స్ వర్క్ బాగా డిలే అవుతుందని తెలుస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది