RRR Movie : బ్రేకింగ్.. ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా.. షాక్ లో అభిమానులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR Movie : బ్రేకింగ్.. ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా.. షాక్ లో అభిమానులు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2022,6:46 pm

RRR Movie : టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం తొలి రోజే చేదు వార్త ఎదురైంది. దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్… మూవీ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఎట్టకేలకు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ నెల 7న ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా…తమ చిత్రాన్ని వాయిదా వేయవలసి వచ్చిందని.. సినిమా కోసం వేచి చూసిన అభిమానులకు క్షమాపణలు చెబుతూనే…

వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని చిత్ర యూనిట్ తెలిపింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని మళ్లీ మీ ముందుకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నామ‌ని నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్ టైన్ మెంట్ పేర్కొంది. బాహుబలి అనంతరం రాజ‌మౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా నటించారు.

RRR movie team announce that the movie is postponed

RRR movie team announce that the movie is postponed

దేశ వ్యాప్తంగా.. సంక్రాంతికి వస్తున్నామంటూ భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం.. పోస్ట్ పోన్ అవుతోందంటూ వార్తలు గత రాత్రి నుంచి నెట్టింట హల్ చల్ చేశాయి. ఆ పుకార్లు నిజమేనంటూ చిత్ర బృందం చేసిన పోస్ట్ పై ఇప్పుడు అభిమానులంతా నిరాశ వ్యక్త పరుస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది