RRR Movie : ఆర్ఆర్ఆర్ టిక్కెట్ ధర ఐదు వేల రూపాయలా.. షాక్ అవుతున్న సినీ అభిమానులు
RRR Movie: ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. దాదాపు 500 కోట్లతో చిత్రం రూపొందినట్టు తెలుస్తుండగా, భారీ లాభాలు రాబట్టేందుకు మేకర్స్ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్ రేట్లను పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజులు(మార్చి25-మార్చి27) వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, తర్వాత వారం రోజులు(మార్చి28-ఏప్రిల్3) రూ.50 పెంచుకోవచ్చు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.50, ఆ తర్వాత వారం రోజుల పాటు రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన పది రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకునే వెసలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.మూడు రోజులవరకు టిక్కెట్ల ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.233గా ఉండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.413 ఉండనుంది. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి రూ.75 పెంచుకోవచ్చని తెలిపింది.కార్పోరేషన్‌లో సింగిల్ స్క్రీన్‌లలో రూ.236, మల్టీప్లెక్స్‌లలో రూ.265గా ఉండగా,మున్సిపాలిటీలో అయితే ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లో రూ.206, మల్టీప్లెక్స్‌లలో రూ.236 గా ఉండనుంది.
RRR Movie : బాబోయ్ అవేమి ధరలు..

RRR Movie ticket rates are high
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు.. ఆర్ఆర్ఆర్ కోసం హైదరాబాద్‌లో దాదాపు పదిహేను చోట్ల బెనిఫిట్ షో పడుతుంది. ఉదయం నాలుగు గంటలకు ఈ షో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బెనిఫిట్ షోలను హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రదర్శిస్తున్నారు. ఈ షోస్ టికెట్స్‌ను సొంతం చేసుకోవడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. బయటకు వచ్చిన వార్తల మేరకు ఒక్కో టికెట్ ధర మూడు నుంచి ఐదు వేలు పలుకుతుందట. ఓ బెనిఫిట్ షోకు ఈ రేంజ్‌లో ధరలను పెట్టి టికెట్స్ అమ్మడం వాటి కోసం ఫ్యాన్స్ పోటీలు పడటం టాలీవుడ్‌లో ఇదే తొలిసారిగా అనుకోవాలంతే