National Film Awards : జైభీమ్ సినిమాకి అవార్డు రాకుండా అడ్డుకున్నది ఎవరు? రాజమౌళికి అన్యాయం అందుకే జరిగిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

National Film Awards : జైభీమ్ సినిమాకి అవార్డు రాకుండా అడ్డుకున్నది ఎవరు? రాజమౌళికి అన్యాయం అందుకే జరిగిందా?

 Authored By gatla | The Telugu News | Updated on :28 August 2023,7:00 pm

National Film Awards : ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇది. జాతీయ సినీ చలనచిత్ర అవార్డులను తాజాగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు ఒక తెలుగు హీరోకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. కానీ.. 69వ జాతీయ ఉత్తమ ఫిలిం అవార్డ్స్ లో ఒక తెలుగు హీరోకు జాతీయ అవార్డు వచ్చింది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అవార్డు రావడం వరకు అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఒక స్మగ్లింగ్ స్టోరీ నేపథ్యంలో సాగే సినిమాలో నటించిన ఒక స్మగ్లర్ కు ఎలా జాతీయ అవార్డు ఇస్తారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

ఒక స్మగ్లర్ కి అవార్డు ఇచ్చి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ఎందుకు అవార్డు ఇవ్వలేదు అనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే.. జై భీమ్ లాంటి ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కథతో వచ్చిన ఆ సినిమా హీరోకు ఎందుకు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వలేదు అని చర్చిస్తున్నారు. సరే.. ఇదంతా పక్కన పెడితే ఉత్తమ చిత్రంగా అయినా కనీసం జై భీమ్ కి కానీ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు కానీ ఇవ్వాలి కదా. కానీ.. ఉత్తమ చిత్రంగా హిందీ మూవీ రాకెట్రీకి ఇచ్చారు. అసలు ఉత్తమ చిత్రం కేటగిరీలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా, జైభీమ్ సినిమాలు పోటీ పడలేకపోయాయా? వాటిని మంచి రాకెట్రీ ఉందా అంటే అదీ లేదు. జై భీమ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు ఉత్తమ చిత్రం అవార్డులు రాకపోవడంతో జనాలు షాక్ అవుతున్నారు.

why jai bhim movie was not selected for national film awards

National Film Awards : జైభీమ్ సినిమాకి అవార్డు రాకుండా అడ్డుకున్నది ఎవరు? రాజమౌళికి అన్యాయం అందుకే జరిగిందా?

National Film Awards : ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి కనిపించలేదా?

ఇక.. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కూడా మలయాళం సినిమా దర్శకుడికి ఆ అవార్డు ఇచ్చారు. గోదావరి అనే సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కి ఆ అవార్డు ఇచ్చారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు.. యావత్ భారతదేశ సినీ ఇండస్ట్రీ గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారు రాజమౌళి. అటువంటి రాజమౌళికి ఉత్తమ దర్శకుడి అవార్డు రాకపోవడం ఏంటి. అసలు.. ఒక బాహుబలి కావచ్చు.. ఆర్ఆర్ఆర్ కావచ్చు. ఈ సినిమాలకు ఖచ్చితంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావాల్సిందే. కానీ.. ఇక్కడ రాజమౌళికి అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి.

అయితే.. 2021, 2022 ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ అవార్డులను ప్రకటించడంతో కొందరు హీరోలు, దర్శకులు, కొన్ని సినిమాలకు అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా బెస్ట్ హీరో కేటగిరీ కింద పోటీ పడినా వాళ్లకు అవార్డు దక్కలేదు కానీ.. పుష్పకు మాత్రం దక్కింది.

ఇక్కడ వింత ఏంటంటే.. సాధారణంగా వేర్వేరు భాషల సినిమాలు అవార్డుల కోసం పోటీ పడుతుంటాయి. కానీ.. ఈసారి మాత్రం తెలుగు సినిమాలు, తెలుగు సినిమాల హీరోల మధ్యనే పోటీ నెలకొన్నది. అంటే.. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ఎంత ప్రభావం చూపిస్తున్నదో ఈ అవార్డులను చూసే తెలుసుకోవచ్చు. ఒకరకంగా చూడాలంటే ఇవి తెలుగు సినిమా అవార్డులా లేక జాతీయ అవార్డులా అనే అనుమానం కూడా కలుగుతుంది. దానికి కారణం.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకే ఎక్కువ అవార్డులు రావడం.

ఏది ఏమైనా.. ఒక స్మగ్లింగ్ స్టోరీని సెలెక్ట్ చేసిన జ్యూరీ సిబ్బంది.. ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన జై భీమ్ సినిమాను మాత్రం పట్టించుకోలేదు. అసలు ఆ సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. ఏ అవార్డు కూడా ఆ సినిమాకు దక్కకపోవడంపై చాలామంది పెదవి విరుస్తున్నారు. జై భీమ్ సినిమాను ఎందుకు జ్యూరీ పట్టించుకోలేదు. అసలు ఈ అవార్డులు పారదర్శకంగా ఇచ్చారా.. ఈ అవార్డుల వెనుక ఎవరైనా ఉన్నారా? జై భీమ్ సినిమాకు బెస్ట్ సినిమా కేటగిరీ కానీ.. బెస్ట్ హీరో కేటగిరీ కానీ.. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో కానీ.. ఎందులోనూ సెలెక్ట్ చేయకపోవడం పట్ల మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది