JR NTR : తేనెటీగ‌ల దాడి నుండి త‌ప్పించుకున్న ఎన్టీఆర్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

JR NTR : తేనెటీగ‌ల దాడి నుండి త‌ప్పించుకున్న ఎన్టీఆర్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

JR NTR : ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘దేవర. ఈ చిత్రం కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. చిత్రంలో క‌థానాయిక‌లుగా శ్రీదేవి గార‌ల‌ప‌ట్టి జాన్వీకపూర్,మ‌రాఠీ భామ శృతి మరాటే న‌టిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా మూవీని తెరకెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ 10న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా, ఇటీవ‌ల గోవాలో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2024,2:00 pm

JR NTR : ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘దేవర. ఈ చిత్రం కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. చిత్రంలో క‌థానాయిక‌లుగా శ్రీదేవి గార‌ల‌ప‌ట్టి జాన్వీకపూర్,మ‌రాఠీ భామ శృతి మరాటే న‌టిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా మూవీని తెరకెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ 10న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా, ఇటీవ‌ల గోవాలో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి.

ప‌రిస్థితి ఎలా ఉంది?

డ్రోన్ షాట్ తీస్తున్న స‌మ‌యంలో తేనేటీగ‌లు ఒక్క‌సారిగా లేచాయని, దాదాపు 20 మంది యూనిట్ సభ్యులకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే గమనించి చిత్ర బృందాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో తారక్ కి ఏమైందో అని కంగారు పడుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేకుండా ఉండే సన్నివేశాలను షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా చిత్ర యూనిట్ స్పందించ‌లేదు. ఎవ‌రెవ‌రు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎవ‌రి ప‌రిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ చిత్రం మాసివ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ తో అదిరిపోయే సబ్జెక్ట్ రెడీ చేశారు. చూస్తుంటే ఇద్దరూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది