RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్ రెమ్యూనరేషన్ విషయంలో చరణ్, తారక్ ఫ్యాన్స్ మద్య ఫైటింగ్
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్దమయింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన విజువల్స్ ఇప్పటికే రావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగి పోయాయి. రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ఈ సినిమాకు ఖర్చు చేయడం కూడా ఈ సినిమా పై అంచనాలను పెంచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అత్యధిక ఆదరణ దక్కడానికి కారణం సూపర్ […]
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్దమయింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన విజువల్స్ ఇప్పటికే రావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగి పోయాయి. రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ఈ సినిమాకు ఖర్చు చేయడం కూడా ఈ సినిమా పై అంచనాలను పెంచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అత్యధిక ఆదరణ దక్కడానికి కారణం సూపర్ స్టార్ అయినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించడమే. వీరిద్దరి కాంబో లో నభూతో న భవిష్యతి అన్నట్లుగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో టాలీవుడ్ జక్కన్న ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. మార్చి 25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నందమూరి మరియు మెగా అభిమానులు సోషల్ మీడియా తో పాటు థియేటర్ల వద్ద బాహాటంగా కూడా ఫైటింగ్ కి దిగుతున్నారు. ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చించుకుంటూ బ్యాడ్ గా పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు తమ హీరో పారితోషికం ఎక్కువ అంటే కాదు తమ హీరో పారితోషికం ఎక్కువ అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మొదలు పెట్టారు.
తమ హీరో సీనియర్ కనుక కచ్చితంగా ఎన్టీఆర్ కి ఎక్కువ పారితోషికం ఎక్కువ ఇచ్చి ఉంటారు. మీ హీరో జూనియర్ కనుక ఆయనకు తక్కువ పారితోషికం ఇచ్చి ఉంటారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తూ ఉన్నారు. అందుకు రామ్చరణ్ అభిమానులు కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎన్టీఆర్ అభిమానులను మరింత రెచ్చగొడుతూ వీళ్ళు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం శృతి మించుతోంది. ఆ ఇద్దరు హీరోలు చాలా ఫ్రెండ్లీ గా ఉంటే వీరు మాత్రం ఇలా చేయడం సబబు కాదు అంటున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియా వరకు అయితే పర్వాలేదు.. కానీ రేపొద్దున థియేటర్లలో కూడా కనిపిస్తే స్క్రీన్ లు చినగడం సీట్లు విరగడం వంటివి జరుగుతాయేమో అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.