senior actress sadha got tattoo on her hand
Sadha : నితిన్ సరసన నటించి వెళ్లవయ్యా వెళ్లు అనే మాటతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ సదా. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది ఈ బ్యూటి. వరుసగా స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుని అటు కోలీవుడ్..ఇటు టాలీవుడ్ రెండింటిలోను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటి..ప్రజెంట్ అవకాశాలు లేక ఖాళీ గా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేసింది. ప్రస్తుతం ఆ అమ్మడికి కూడా క్రేజ్ పెరుగుతూ పోతుంది. అయితే సదా తాజాగా ఓ హీరో గురించి స్టన్నింగ్ కామెంట్స్ చేయగా, అవి వైరల్ అయ్యాయి.
సదా ముచ్చట్లు..
హీరోయిన్ సదా కెరీర్ లో అపరిచితుడు బిగ్గెస్ట్ హిట్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది, కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అపరిచితుడు మూవీలో విక్రమ్ నటన అద్భుతమని చెప్పాలి. ఆయన కమల్ హాసన్ లాంటి గొప్ప నటులను గుర్తు చేశారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు సదా గుర్తు చేసుకున్నారు. విక్రమ్ తో నా పెయిర్ బాగుంది. మా మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరిందని సెట్స్ లో అందరూ చెప్పుకునేవారు. అయితే హీరో విక్రమ్ మాత్రం నన్ను సిస్టర్ అని పిలిచేవాడు.
Sadha intresting comments viral
కథలో భాగంగా మేమిద్దరం కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వచ్చింది. డైరెక్టర్ శంకర్ షాట్ రెడీ అనగానే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేవాళ్ళం. డైరెక్టర్ కట్ చెప్పాక విక్రమ్ నన్ను చెల్లి అంటూ పిలిచేవారు. ఇది చూసి సెట్స్ లో ఉన్న సిబ్బంది, నేను నవ్వుకునేవాళ్ళం. మళ్లీ పక్క రోజు సినిమా షూటింగ్ రోమాంటిక్ సీన్స్ అప్పుడు..సిస్టర్ అంటూ స్టార్ట్ చేసేవాడు..ఇలానే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది..” అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయమై డైరెక్టర్ శంకర్ సీరియస్ అయ్యాడు. ప్రేక్షకులు హీరో హీరోయిన్ అంటే లవర్స్ భావనలో చూస్తారు. మీరు ఇలా అన్నా చెల్లి అని పిలుచుకుంటారని బయటికి తెలిస్తే… మొత్తం నాశనం అవుతుంది. రేపు తెరపై మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేరని శంకర్ అన్నారట.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.