Sahithi Dasari : ఊరి పొలిమేర సినిమాలో అలా.. బయట అందంతో అరాచకం సృష్టిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Sahithi Dasari : ఊరి పొలిమేర సినిమాలో అలా.. బయట అందంతో అరాచకం సృష్టిస్తుందిగా..!
Sahithi Dasari : కొంత మంది భామలు డీ గ్లామర్ లుక్‌లో కూడా కనిపించేందుకు ఏమాత్రం వెనకాడం లేదు. ఇటీవల ప్రేక్షకులని అలరించిన హారర్ సినిమాలలో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటిలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Sahithi Dasari : ఊరి పొలిమేర సినిమాలో అలా.. బయట అందంతో అరాచకం సృష్టిస్తుందిగా..!
Sahithi Dasari అదరగొట్టేశావుగా..
ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ భార్యగా కామాక్షి భాస్కర్ల నటించడం జరిగింది. అలాగే గెటప్ శ్రీను భార్యగా డి గ్లామర్ లుక్ లో నటించిన బ్యూటీ సినిమాకి చాలా కీలకం. రాములు అనే పాత్రలో నటించిన ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఆమె పేరు సాహితీ దాసరి. మా ఊరి పొలిమేర సినిమాతో సాహితీ దాసరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్ గా ఈమెకు సామాజిక మాధ్యమాలలో బాగా ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తోనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది. గాయిని సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరి అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. అయితే సాహితీ కొన్ని గ్లామర్ పిక్స్ చూసి జనాలకి మెంటలెక్కిపోతుంది. ఏంటి ఈ అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.