Sai Pallavi : సాయి పల్లవి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే మతులు పోవల్సిందే…!
Sai Pallavi : మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. నటనతో ఆకట్టుకునే నటీమణుల్లో సాయి పల్లవిదే అగ్ర స్థానం. పాత్ర నచ్చకపోతే , నిర్మోహమాటంగా సినిమాను తిరస్కరించే అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. ఇక ఈమె నటించిన విరాట పర్వం మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఫ్యామిలీ నేపథ్యం ఏమిటనేది ఇపుడు వార్తల్లో నిలిచింది.మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది.ఇక తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది.
ఇక సాయి పల్లవి ఏదైనా సినిమా చేసిందంటే. .అందులో ప్రత్యేకత ఉంటుందనేది ప్రేక్షకుల్లో వెళ్లి పోయింది. గతేడాది నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాతో పలకరించింది. ఆ తర్వాత నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’లో నాట్యగత్తె పాత్రలో ఎలా జీవించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా స్పష్టంగా తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. డ్యాన్సులైనా, నటనలోనైనా సాయి పల్లవిని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇక ఈమె క్రేజ్‌ను చూసి చాలా మంది లేడీ పవర్ స్టార్ అంటూ బిరుదులు కూడా ఇచ్చేసారు.తాజాగా సాయి పల్లవి విరాట పర్వం వంటి విభిన్న సినిమాలతో పలకరించేందుకు రెడీగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.
Sai Pallavi : ఓపెన్ కామెంట్స్..
దీంతో నేటిజన్స్ నీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇది.. నువ్వు ఇలా మాట్లాడమేమిటి అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. సాయి పల్లవి కుటుంబం విషయానికొస్తే.. వాళ్లది కర్ణాటకలోని తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతం.. ఇక వీరి సామాజిక వర్గాన్ని బడగ అంటారు.. బడగా అంటే.. కన్నడలో ఉత్తరం అని అర్ధం. ఇక డాక్టర్ చదువుకొని.. యాక్టర్‌గా కొనసాగుతోంది. ఇక వీళ్ల నాన్నగారు GST డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఆఫీసర్. రీసెంట్ ఇంటర్వ్యూలో మీది లెఫ్టిస్ట్ భావజాలమా.. లేక రైటిస్ట్ భావజాలమా అని యాంకర్ సాయి పల్లవిని అడిగారు. అందుకు సాయి పల్లవి తాను న్యూట్రల్ అని సమాధానం చెప్పారు. తానొక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. కాబట్టి తాను న్యూట్రల్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీ తననొక మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటుందని.. అణచివేతకు గురయ్యేవారిని రక్షించాలని చెప్పే మనస్తత్వమని చెప్పుకొచ్చారు.