పవన్ కళ్యాణ్ అయినా నా రెమ్యూనరేషన్ అంతే.. తగ్గేది లేదు .. సాయిపల్లవి ..?

Authored By vamana sai | The Telugu News | Published on: December 26, 2020, 1:42 pm

పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఎంత మంది క్యూలో ఉంటారో లెక్క చెప్పలేము. పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన శృతిహాసన్ లాంటి వాళ్ళు ఐరెన్ అన్న ముద్ర తొలగించుకొని స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. అంతేకాదు వకీల్ సాబ్ లో శృతిహాసన్ మూడవ సారి పవన్ కళ్యాణ్ తో నటిస్తోంది. చాలామంది హీరోయిన్స్ కి స్టార్ డం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ నటించడానికి వెనకడడు.

Shruti Haasan to play female lead in PSPK 28?- Cinema express

కాగా ప్రస్తుతం వకీల్ సాబ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నపవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరో గా నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.

కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా సాయి పల్లవి, రానా కి జంటగా ఐశ్వర్య రాజేష్ నటించబోతుందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది తెలుస్తోంది. ఇది నిజమా కాదా అన్నది తెలియనప్పటికి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Sai Pallavi Who Said No To Pawan Kalyan's Movie? - Telugu Ayyappannum  Koshiyum Kalyan Sagar Chandra Rejects Movie Tollywood News-TeluguStop

సాయి పల్లవి ఈ సినిమాలో వారం నుండి పది రోజులు నటించేందుకు రెగ్యులర్ సినిమా కి అడిగినట్టుగానే రెండు కోట్లు రెమ్యూనరేషన్ చెప్పినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కి జంటగా అది కూడా అతి తక్కువ రోజులు అయినా సరే సాయి పల్లవి మాత్రం రెమ్యూనరేష విషయంలో కాంప్రమైజ్ కావడం లేదన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి అఫీషియల్ గా ఈ విషయం వెల్లడైతేనే నమ్మడానికి వీల్లేదు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp