సాయి పల్లవి డైరెక్టర్స్ హీరోయిన్స్…అనడంలో తప్పేముంది ..?
సినిమా ఇండస్ట్రీలో వేళ్ళ మీద లెక్కపెట్టేవే దర్శకుడి సినిమాలు ఉంటాయి. అందుకు ఉదాహరణ రాజమౌళి తీసే సినిమాలు. అలాగే కొరటాల శివ.. ఏ బిల్మ్ బై అరవింద్ లాంటి సినిమా.. చంద్ర శేఖర్ యేలేటి అనుకోకుండా ఒకరోజు.. అలాగే లేడీ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కించిన గురు, ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలు. ఇలాంటి సినిమాలు ఏ భాషలో అయినా చాలా అరుదుగా వస్తుంటాయి. తమిళంలో మణిరత్నం ఈ తరహా సినిమాలు తెరకెక్కిస్తారు. ఇక బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ.. ఓం రౌత్ లాంటి వాళ్ళు ఉన్నారు. డిజాస్టర్ అయినా ఈ దర్శకుల సినిమాలకి .. ఆ సినిమాల మేకింగ్ కి గొప్ప ప్రశంసలు దక్కుతుంటాయి.
అంతేకాదు వీళ్ళ సినిమాలకి దర్శకుడి సినిమా అన్న బ్రాండ్ కూడా ఉంటుంది. ఇక ఇలాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తిండి పోతాయి. అలాగే హీరోయిన్స్ విషయంలో కూడా అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో నూ ఇలాంటి పేరే ఉంటుంది. ఈ హీరోయిన్ దర్శకుల హీరోయిన్ అని చెప్పుకుంటుంటారు. అయితే అలాంటి హీరోయిన్స్ సౌత్ అండ్ సినిమా ఇండస్ట్రీలలో చాలా తక్కువమందే ఉన్నారు. ఆ కాలంలో కాస్త ఎక్కువమంది ఉన్నప్పటికి ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో దర్శకుడి హీరోయిన్ అని చెప్పుకునే వాళ్ళు బూతద్దంలో వెతికి చూడాల్సిందే.
అప్పట్లో మహానటి సావిత్రి, భానుమతి, జమున.. ఆ తర్వాత శ్రీదేవి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఆ తర్వాత జనరేషన్ లో సౌందర్య పేరే ఈ దర్శకుల హీరోయిన్ అన్న లిస్ట్ లో వినిపించింది. అంతేకాదు ఇప్పుడు ఉన్న చాలామంది హీరోయిన్స్ కి సావిత్రి తర్వాత సౌందర్య రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఇక ఇప్పటి తరంలో అనుష్క శెట్టి .. తర్వాత సాయి పల్లవి ఈ లిస్ట్ లో ఉన్నారు. సాయి పల్లవి కి దర్శకుల హీరోయిన్ అని పేరుంది. దర్శకులు చెప్పిన సీన్స్ ని తనకి అనుగుణంగా మలచుకొని నేచురల్ గా నటించడానికే ప్రయత్నిస్తుంటుంది. అందుకే సాయి పల్లవి కోసం కొన్ని ప్రత్యేకమైన పాత్రలు తయారవుతున్నాయి.