Sai Pallavi is embroiled in a controversy
Sai Pallavi : సాయి పల్లవి .. రానా జంటగా నటించిన మూవీ విరాట పర్వం . త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. అయితే ప్రమోషన్ల కోసం తాజాగా సాయి పల్లవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. ఈ క్రమంలో సాయి పల్లవి పలు సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విరాట పర్వం నక్సల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కిన సినిమా. ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. సాయి పల్లవి ఈ మధ్యనే కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని చెప్పుకొచ్చింది.
కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో ఎలా చంపారు, అనే విషయాలను చూపించారు. మనం వాటిని ఒక మత సంఘర్షణలాగానే చూస్తే ఇప్పుడు రీసెంట్ గా బండిలో కౌ(ఆవు)లు తీసుకు వెళుతున్నారు. బండిలో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడు అని కొంతమంది కట్టేసి జైశ్రీరామ్ జైశ్రీరామ్ అని అనమంటున్నారు. అలా అయితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టము, లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు, మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు అని ఆమె చెప్పుకొచ్చింది.
Sai Pallavi is embroiled in a controversy
అయితే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయం మీద సాయిపల్లవి వ్యవహారంలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొంతమంది సాయి పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం సాయి పల్లవికి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుని మాట్లాడమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే సాయి పల్లవి దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో మేము విరాటపర్వం సినిమాని చూడడం లేదు అని మా తరపునుంచి మేము సినిమాను బాన్ చేసుకుంటున్నాము అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సాయి పల్లవి స్పందిస్తుందా అన్నది చూడాలి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.