Salaar Story : ప్రభాస్ సలార్ మూవీ తెలుసు కదా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ తాజాగా లీక్ అయింది. లీక్ అనేకంటే కూడా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడని చెప్పుకోవాలి. నిజానికి ఈ మూవీ ఇంకొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచమే ఇప్పుడు సలార్ మూవీ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. ట్రైలర్ కోసమే జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే.. ఇక మూవీ కోసం ఇంకెంత కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాలి చెప్పండి. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. సినిమా స్టోరీ ఏంటో చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం అందరి కళ్లు సలార్ స్టోరీ మీదనే పడ్డాయి. ఇంతకీ సలార్ స్టోరీ ఏంటి.. అసలు ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం రండి.
ముందు మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే.. కేజీఎఫ్ కు, ఈ సినిమా స్టోరీకి అస్సలు సంబంధమే ఉండదు. కాకపోతే సలార్ కూడా రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22 న రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులకు సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇద్దరు స్నేహితులకు సంబంధించింది. ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేదే సినిమా కథ. కొన్ని సంఘటనల వల్ల వాళ్లు బద్ధ శత్రువులు అవుతారు. స్నేహం అనేదే ఈ సినిమాలో ముఖ్యమైన ఎమోషన్. దాన్నే తొలి భాగంలో ఎక్కువగా చూపించబోతున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్.. ఎలా స్నేహితులుగా ఉన్నారు.. ఆ తర్వాత ఇద్దరూ బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. వాళ్లు ఎందుకు అలా మారారు? అనేదే అసలు సినిమా.
డిసెంబర్ 1న సలార్ తొలి పార్ట్ ట్రైలర్ రానుంది. తొలి పార్ట్ కు సీజ్ ఫైర్ అనే క్యాప్షన్ పెట్టారు. రెండో పార్ట్ పేరు ఇంకా ప్రకటించలేదు. కాకపోతే సినిమా విడుదలైన తర్వాత సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి రెండో పార్ట్ కథలో ఏమైనా మార్పులు చేసుకోవాలా అనేది మూవీ యూనిట్ ఆలోచించనుంది. అయితే.. కేజీఎఫ్ కు, ఈ సినిమాకు మాత్రం అస్సలు బంధం లేదు. ఆ మూవీ స్టోరీ వేరు.. ఈ మూవీ స్టోరీ వేరు. ఇక.. సలార్ మూవీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మూవీ స్టోరీ తెలుసుకున్నాక ప్రభాస్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్, మూవీ రిలీజ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.