before poling these two parties alliance in telangana
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు కూడా సమయం లేదు. రేపు ఈ సమయం వరకు సగం శాతం పోలింగ్ కూడా పూర్తవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది గెలుపు అనేది పక్కన పెడితే ఎన్నికలకు ఇంకా ఒక్క రోజే ఉండటంతో ప్రచారం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ డబ్బులు పంచే పనిలో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభానికి పూనుకుంటున్నాయి. నిజానికి ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రావడం కూడా కష్టమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ బీభత్సంగా దూకుడు మీదుంది. మామలుగా కాదు.. రచ్చ రచ్చ చేసేలా ఉంది కాంగ్రెస్ పార్టీ. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మామూలు ఊపు లేదు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు కాస్త హీట్ ను పెంచుతున్నాయనే చెప్పుకోవాలి.
అయితే.. అధికార బీఆర్ఎస్ పార్టీపై ఇంత నెగెటివిటీ రావడానికి కారణం ఒకే ఒక్క విషయం. అది బీజేపీతో సఖ్యతగా ఉండటం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీని మైకుల ముందు తిట్టి.. వెనుక మాత్రం ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ కాకుండా ఆపిందని.. అందుకే బీఆర్ఎస్, బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని అంటున్నారు. ఒక సంవత్సరం కింది వరకు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అంటే అందరూ బీజేపీ అనే అన్నారు. అప్పటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. రెండో స్థానంలో ఉన్న బీజేపీని నెట్టేసి కాంగ్రెస్ టాప్ లోకి వచ్చేసింది. బీజేపీ మళ్లీ మూడోస్థానానికి పడిపోయింది. అయితే.. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వేరు.. బీఆర్ఎస్ స్ట్రాటజీ వేరు.
ఇక్కడ అసలు వ్యూహం ఏంటంటే.. బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ అందుకోక పోయినా.. ఎంఐఎం సీట్లు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత బీజేపీ సీట్లు కొన్ని ఉంటాయి. ఎంఐఎం సీట్లు సరిపోకపోతే.. బీజేపీ సీట్లను కూడా సాయం తీసుకొని.. బీజేపీకి కూడా అధికారంలో షేర్ ఇచ్చేలా.. బీజేపీ సపోర్ట్ తో అధికారంలోకి రావాలనేది బీఆర్ఎస్ ప్లాన్. బీజేపీ ప్లాన్ ఏంటంటే.. బీఆర్ఎస్ సాయంతో అధికారంలోకి వచ్చి కొంత సమయం తర్వాత బీఆర్ఎస్ లో చీలికలు తీసుకొచ్చి మహారాష్ట్ర ప్లాన్ ను అమలు చేయాలనేది వాళ్ల వ్యూహం. ఎటు చేసి ఈ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ.. కాంగ్రెస్ ను మాత్రం అధికారంలోకి రాకుండా చేయాలనేది అసలు ప్లాన్. మరి.. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
This website uses cookies.