Salaar VS Devara : ఇదేం ట్విస్ట్ బాబోయ్.. సలార్ 2, దేవర రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్.. బాక్సాఫీసు తట్టుకోగలదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Salaar VS Devara : ఇదేం ట్విస్ట్ బాబోయ్.. సలార్ 2, దేవర రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్.. బాక్సాఫీసు తట్టుకోగలదా?

Salaar VS Devara : ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే. మామూలు ట్విస్ట్ కాదిది. ఎందుకంటే రెండు గ్లోబల్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ అయితే అసలు బాక్సాఫీసు తట్టుకోగలదా? రెండు పెద్ద సినిమాలు, అది కూడా పెద్ద హీరోల సినిమాలు.. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మామూలుగా ఉండదు సీను. రచ్చ రంబోలానే. అవి కూడా మామూలు సినిమా కాదు బాబోయ్.. ఒకటి సలార్ పార్ట్ 2, రెండోది […]

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  సలార్ 2, దేవర రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా?

  •  అదే జరిగితే బాక్సాఫీసు బద్దలవడం ఖాయం

  •  వేసవి కానుకగా రాబోతున్న రెండు భారీ బడ్జెట్ సినిమాలు

Salaar VS Devara : ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే. మామూలు ట్విస్ట్ కాదిది. ఎందుకంటే రెండు గ్లోబల్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ అయితే అసలు బాక్సాఫీసు తట్టుకోగలదా? రెండు పెద్ద సినిమాలు, అది కూడా పెద్ద హీరోల సినిమాలు.. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మామూలుగా ఉండదు సీను. రచ్చ రంబోలానే. అవి కూడా మామూలు సినిమా కాదు బాబోయ్.. ఒకటి సలార్ పార్ట్ 2, రెండోది జూనియర్ ఎన్టీఆర్ దేవర. అసలు సలార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే.. దేవర సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ రెండు సినిమాలు ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం తట్టుకోవడం కష్టమే. నిజానికి ఈ రెండు సినిమాలను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సలార్ పార్ట్ 1 కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అంతవరకు బాగానే ఉంది కానీ.. సలార్ పార్ట్ 2 విడుదల విషయంలోనే దేవర సినిమాతో క్లాష్ వస్తోంది. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను కూడా 2024 సమ్మర్ కానుకగా తీసుకురావాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. సలార్ పార్ట్ 2 కూడా ఏప్రిల్ 2024 లో రిలీజ్ కాబోతుందట. ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో, కొన్ని రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన, ఒకే రోజుల రిలీజ్ అయినా కూడా తట్టుకోవడం మాత్రం కష్టమే. దీన్ని రెండు సినిమాల మేకర్స్ ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు కానీ.. రెండు సినిమాలు మాత్రం ఏప్రిల్ 2024 లోనే వేసవి కానుకగా విడుదల కాబోతున్నాయి.

Salaar VS Devara : ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్

సలార్ 2 మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకో రెండు మూడు నెలల్లో పూర్తయినా కూడా సినిమాను వేసవి కానుకగానే తీసుకురావాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. పార్ట్ వన్ కి, పార్ట్ 2 కి మధ్య కనీసం 6 నెలల గ్యాప్ ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. దేవర షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకొని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది