Karishma Sharma | కదులుతున్న రైలు నుండి దూకిన బాలీవుడ్ నటి.. పరిస్థితి ఎలా ఉంది?
Karishma Sharma | బాలీవుడ్ నటి కరిష్మా శర్మ కదులుతున్న రైలు నుంచి దూకడంతో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది? కరిష్మా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సంఘటన గురించి వివరించడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. తన ఇన్‌స్టాలో నిన్న ఓ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లడానికి చీర కట్టుకుని బయల్దేరాను. ముంబై లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది.
#image_title
పెద్ద ప్రమాదమే తప్పింది..
అయితే నా స్నేహితులు రైలు అందుకోలేకపోయారు. వాళ్లు ఎక్కలేకపోయారన్న భయం, టెన్షన్‌తోనే నేను కదులుతున్న రైలు నుంచి దూకేశాను. దురదృష్టవశాత్తూ వెనక్కి పడటంతో నా వీపు, తలకు గాయాలు అయ్యాయి” అని ఆమె రాసుకొచ్చారు. అయితే డాక్టర్లు ఆమెకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని.. తలకు గాయం కారణంగా ఎంఆర్ఐ చేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. కరిష్మా తన అభిమానులను ధైర్యం చెబుతూ.. నేను బాగానే ఉన్నాను, త్వరగా కోలుకుంటాను. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా అవసరం అని పేర్కొన్నారు. 2015లో వచ్చిన ‘ప్యార్ కా పంచనామా 2’ సినిమాలో తన గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘రాగిని ఎంఎంఎస్: రిటర్న్స్’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్ చేసి మరింత పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘ఉజ్డా చమన’, ‘హోటల్ మిలన్’, ‘సూపర్ 30’ వంటి చిత్రాల్లో కూడా నటించి తన ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు.