Vicky Kaushal | విక్కీ కౌశల్ కఠిన నిర్ణయం .. మాంసాహారం, మద్యం పూర్తిగా వదిలేస్తున్న స్టార్ హీరో
Vicky Kaushal | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత విభిన్నమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. ‘స్త్రీ 2’ ఫేమ్ దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించబోతున్న భారీ పౌరాణిక చిత్రం ‘మహాఅవతార్’ లో విక్కీ పరశురాముడి పాత్రలో నటించనున్నారు. ఈ పాత్రను నిజజీవితంలోనూ ప్రతిబింబించాలనే తపనతో విక్కీ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు.
#image_title
కఠిన నిర్ణయం..
జీ న్యూస్ ప్రకారం, విక్కీ కౌశల్ మరియు దర్శకుడు అమర్ కౌశిక్ ఇద్దరూ ఈ సినిమా పూర్తయ్యే వరకు మాంసాహారం, మద్యపానం పూర్తిగా మానుకోవాలని నిర్ణయించుకున్నారు. పరశురాముడి పవిత్రత, ఆధ్యాత్మికతను గౌరవిస్తూ పాత్రపై సంపూర్ణ ఏకాగ్రతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వచ్చే ఏడాది మధ్యలో ఒక ప్రత్యేక పూజా కార్యక్రమంతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘మహాఅవతార్’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందించనున్నారు. 2026 చివరలో షూటింగ్ ప్రారంభమై, 2028లో విడుదల అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఒక సంవత్సరం పాటు షూటింగ్ జరగనుండగా, ఆ తర్వాత ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు కొనసాగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు అమర్ కౌశిక్ సినిమా ప్రీ-విజువలైజేషన్ (Pre-Vis) పనుల్లో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా, విక్కీ కౌశల్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ లతో కలిసి నటిస్తున్నారు.