Samantha : స‌మంత ఏంటి ఇలా త‌యారైంది… ఆ హీరోతో మ‌రీ అంత రాసుకొని పూసుకొనా?

Authored By Sam C | The Telugu News | Updated on : 20 July 2022, 8:30 pm

Samantha : నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. సినిమాలు, సోష‌ల్ మీడియా, టీవీ షోల ద్వారా స‌మంత అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. విడాకుల తర్వాత సమంత ఏం చేసినా అది వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మధ్య హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేస్తున్న సమంత అనూహ్యంగా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మెరిసింది. అయితే ఈ ప్రోగ్రాంకి ఆమెతో కలిసి హాజరైన అక్షయ్ కుమార్ ఆమెను తన చేతులతో ఎత్తుకొని షోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్..

ఈ గురువారం టెలికాస్ట్ కానుంది. దీంతో సమంత ఎపిసోడ్ కోసం ఆమె అభిమానులతో పాటు..సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఇటీవలే ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, హీరో రణ్ వీర్ సింగ్ వచ్చారు. ఇక సెకండ్ వీక్… సారా అలీఖాన్, జాన్వీ కపూర్ అటెండ్ అయ్యారు. తాజాగా ఈ గురువారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కాఫీ విత్ కరణ్ షోలో మెరవనుంది. ఇక మూడో ఎపిసోడ్లో అక్షయ్ కుమార్ సమంత కలిసి సందడి చేయబోతున్నారు. తాజాగా వీరిద్దరి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను కరణ్ జోహార్ తన ఇన్స్టా వేదికగా విడుదల చేశారు.

samantha akshay kumar koffee with karan promo released

samantha akshay kumar koffee with karan promo released

Samantha : స‌మంత మ‌రీ ఇలానా..

ఇక ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది. సుమారు 55 సెకండ్ల పాటు సాగిన ఈ ప్రోమోలో అక్షయ్ కుమార్ సమంతను ఎత్తుకొని స్టేజి మీదకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కూడా పక్కపక్కనే కూర్చుని కనిపించారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంత పెళ్లి గురించి ప్రశ్నిస్తూ ఉండగా అన్ హ్యాపీ మ్యారేజస్ అన్నిటికి కారణం మీరే అంటూ సమంత కామెంట్ చేసింది. అదేమిటి అంటే కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన కబీ ఖుషి కభీ ఘం అనే సినిమా చూసి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళందరూ అంతా ఆనందంగా ఉంటారని అనుకున్నామని కానీ రియల్ లైఫ్ మాత్రం కేజిఎఫ్ సినిమాలాగా ఉందని చెప్పుకొచ్చింది. పూర్తి ఎపిసోడ్లో స‌మంత చాలా విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌నుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి