Samantha : విడాకుల తర్వాత అక్కినేని ఇంట్లో సమంత.. అందులో అర్థం ఏంటి?
Samantha : అక్కినేని వారి ఇంట కోడలిగా అడుగు పెట్టిన హీరోయిన్ సమంత.. కొన్నాళ్ల తర్వాత అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయింది. నాగ చైతన్య, తాను విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇక సమంత అప్పటి నుండి హైదరాబాద్ లో కన్నా ముంబైలో ఎక్కువగా ఉంటోంది. ఒకప్పుడు హైదరాబాద్ లోనే ఉండే సమంత.. ఇప్పుడ మకాం ముంబైకి మార్చేసింది.అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చేసిన కొన్ని సినిమాలు, క్యారెక్టర్లు .. అక్కినేని ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి.
దీంతో అక్కినేని ఇంటి కోడలివై ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అంటూ ప్రశ్నించారు కూడా. అయితే దీనిపై అటు సమంత కానీ, అక్కినేని నాగచైతన్య కానీ స్పందించలేదు. మొత్తానికి అక్కినేని కుటుంబంతో సమంత తెగతెంపులు చేసుకుంది. తాజాగా అక్కినేని ఇంట్లో సమంత కనిపించడం వార్తల్లో నిలుస్తోంది. అయితే సమంత నేరుగా కాకుండా ఫోటో రూపంలో కనిపించింది. అవును ఓ అడ్వర్టైజ్మెంట్ లో ఇదంతా కనిపించింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ లో..
Samantha : అక్కినేని వారి ఇంట్లో..
అఖిల్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంటే టక్కున నాగార్జున గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా అంటూ అడగడం దానికి సంబంధించిన వివరాలను అఖిల్ చెప్పడం ఈ క్రమంలోనే నాగార్జున చేతిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాగ్ పై సమంత ఫోటో ఉంటుంది. ఇలా యాడ్ లో అక్కినేని వారి కుటుంబ సభ్యుల మధ్యలో సమంత ఫోటో కనిపించడ్ వైరల్ గా మారింది. అక్కినేని కుటుంబం సమంత పట్ల సానుకూలంగా ఉన్నారు అంటూ కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి సమంత మళ్లీ దగ్గరవుతోందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరు మాత్రం పాత వీడియోను కావాలనే వైరల్ చేస్తున్నారని మండిపడుతున్నారు.