Samantha : ఇంత వెరైటీగా మారావేంటి స‌మంత‌.. రెచ్చిపోతున్న ట్రోల‌ర్స్..!

Authored By Sam C | The Telugu News | Published on: August 3, 2022, 1:20 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవలి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. ముఖ్యంగా నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత ఈ అమ్మ‌డు వ‌రుస సినిమాలు చేస్తూనే సోష‌ల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. ఒక్కోసారి అందాలన్నీ క‌నిపించేలా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంటుంది. స‌మంత క్యూట్ లుక్స్ మాత్రం అంద‌రికి షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా సమంత ట్రెండీ వేర్‌లో దుమ్ము రేపిన విషయం తెలిసిందే. రావిషింగ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నయా ట్రెడిషనల్ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

అయితే స‌మంత స్టైలిష్ లుక్స్ కొంద‌రికి న‌చ్చ లేదు. త‌ల‌మీద నుండి ఏదో వేలాడదీసి వెరైటీగా క‌నిపిస్తున్న నేప‌థ్యంలో స‌మంత‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఎవరేమ‌నుకున్నా కూడా స‌మంత మాత్రం తాను అనుకున్న‌దే చేస్తూ ముందుకు సాగుతుంది. ఇటీవల సమంత హిందీలో పాపులర్‌ రియాలిటీ టాక్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌`లో పాల్గొని తన మ్యారేజ్ పై స్పందించిన విష‌యం తెలిసిందే. ఆమె పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన విషయాలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

samantha beauty looks are crazy

samantha beauty looks are crazy

Samantha ; స‌మంత స్ట‌న్నింగ్ లుక్..

మరోవైపు హిందీలో ఆమెకి వరుస ఆఫర్స్ రావడం మరింత సంచలనంగా మారింది. `పుష్ప` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి నార్త్ లో పాపులర్‌ అయ్యింది సమంత. అంతకు ముందు `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా, దాన్ని మరింత పెంచింది `పుష్ప`లోని ఐటెమ్‌ సాంగ్‌. స‌మంత ప్ర‌స్తుతం `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది. ఈ మూడు పాన్‌ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతున్నాయి. దీంతోపాటు ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తుంది. `యశోద` ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్‌ ప్లాన్‌ చేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp