Samantha : సెట్‌లో స‌మంత ఎలా ఉంటుందో చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన న‌టుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సెట్‌లో స‌మంత ఎలా ఉంటుందో చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన న‌టుడు

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. నాగ చైత‌న్య నుండి విడాకుల త‌ర్వాత స‌మంత సినిమాలు, స్పెష‌ల్ సాంగ్స్,టాక్ షోలు ఇలా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను అంది పుచ్చుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తన ఫామ్ ను మరింత పెంచేసుకుంది. ఒక […]

 Authored By sandeep | The Telugu News | Updated on :28 January 2022,6:00 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. నాగ చైత‌న్య నుండి విడాకుల త‌ర్వాత స‌మంత సినిమాలు, స్పెష‌ల్ సాంగ్స్,టాక్ షోలు ఇలా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను అంది పుచ్చుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తన ఫామ్ ను మరింత పెంచేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సుమారుగా దశాబ్ద కాలం గడిచినా కూడా తన ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.స‌మంత చాలా మందితో జ్యోవియ‌ల్‌గా ఉంటుంది.

సెట్‌లో ఆమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఆమె క్యారెక్టర్ గురించి తనతో కలిసి నటించిన నటీనటులు కూడా చాలా అద్భుతంగా కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించారు.. వాళ్లే కాదు సమంతతో రంగస్థలం సినిమాలో కలిసి నటించిన నాగ మహేష్ కూడా ఈమె గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు తెలియజేయడం గమనార్హం. 2018లో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్ గా నటించగా ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే మెరిసింది.రంగ‌స్థలం చిత్రంలో సమంతకు తండ్రి పాత్రలో నాగ మహేష్ నటించారు. నాగ మహేష్ మాట్లాడుతూ రంగస్థలం గురించి అందులో సమంత క్యారెక్టర్ గురించి కూడా ఒక విషయం తెలియ జేశాడు..

samantha character to be revealed by character artist

samantha character to be revealed by character artist

Samantha : స‌మంత గొప్ప‌త‌నం గురించి …..

సినిమాలో నేను ఒక సన్నివేశంలో సమంత చేయి పట్టుకున్నప్పుడు.. నేను చాలా మెల్లగా ఆమె చెయ్యి పట్టుకున్నాను. సమంత ఏం పర్వాలేదు గట్టిగా పట్టుకోండి అని అనడంతో వెంటనే నేను ఆశ్చర్యపోయాను.. ప్రొఫెషనల్ గా సమంత తన పాత్రకు న్యాయం చేస్తుందని ఆమె గురించి చక్కగా తెలిపాడు. కొంత మంది చేయి ప‌ట్టుకుంటే సీరియ‌స్ అవుతున్నారు. స‌మంత అలా చాలా ప్రోఫెష‌న‌ల్‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం స‌మంత హిందీలో, త‌మిళం, తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల‌లో సినిమాలు చేస్తుంది. త్వ‌ర‌లో శాకుంత‌లం అనే సినిమాతో ప‌ల‌క‌రించ‌నుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది