Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలను ప్రజెంట్ అస్సలు పట్టించుకోవడం లేదు. నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత ఈ భామ తన ఫోకస్ మొత్తం ప్రొఫెషనల్ కెరీర్ పైనే పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ దూసుకెళ్తోంది. హిందీ ప్రాజెక్ట్స్ పైన కూడా దృష్టి పెడుతూ, పాన్ ఇండియా ఫిల్మ్సే కాదు.. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా సైన్ చేస్తోంది. తాజాగా తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది ఈ సుందరి. సమంత..నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ అయింది. కానీ, విడుదల తేదీపైన ఇంకా స్పష్టత రాలేదు.
ఈ సంగతి అలా ఉంచితే.. తాజాగా సమంత.. తన వ్యక్తిగత జీవితం, అలవాట్లపైన మీడియాతో ముచ్చటించింది. తన హ్యాబిట్స్ గురించి వివరించింది. తాను ప్రతీ రోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేస్తానని, అలా తనకు డే స్టార్ట్ అవుతుందని తెలిపిన సమంత,.. ప్రతీ రోజు మార్నింగ్ టైమ్స్‌లోనే డే మొత్తం ఎలా ఉండబోతుందని ఆలోచిస్తానని తెలిపింది. ఏయే పనులు చేయాలో ముందే డిసైడ్ అయి నూతనోత్తేజంతో ముందకు సాగుతానని అంది సమంత.తాను పూర్తి వేగన్‌గా మారిపోయానని, శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డానని, అలా తనకు వ్యక్తిగతంగా విపరీతమైన స్వేచ్ఛ ఉందని తెలిపింది. తనకు పిల్లలతో గడపడం చాలా ఇష్టమని, తనకు సానుభూతి కూడా చాలా ఎక్కువని, అదే తనకు
సినీ కెరీర్‌లో ఉపయోగపడిందని అనుకుంటున్నానని చెప్పింది.ప్రతీ రోజు జిమ్ వర్కవుట్స్ పైన దృష్టి సారిస్తానని, సవాలుతో కూడిన పనులు చేయడం తనకు ఇష్టమని అంది సమంత. ఇకపోతే తాను తనతో మాత్రమే పోటీ పడుతానని అలా తనను తాను చాలెంజ్ చేసుకుంటానని అంది నాగ చైతన్య మాజీ భార్య. కొత్త విషయాలను నేర్చుకునేందుకుగాను ఆసక్తి చూపుతానని, గదిలో ఒంటరిగా అస్సలు ఉండలేనని, బయటకు వచ్చి నూతన విషయాలను తెలుసుకుంటానని వివరించింది సమంత.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.