
krithi shetty shows her love on ram charan
Krithi Shetty : మెగా బ్రదర్స్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా తోనే ఉత్తరాది ముద్దుగుమ్మ కృతి శెట్టి కూడా పరిచయం అయ్యింది. మొదటి సినిమా ఉప్పెనలో బేబమ్మ పాత్రలో కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. గతంలో ఏ హీరోయిన్ కూడా ఒకే ఒక్క సినిమా తో వచ్చిన క్రేజ్ తో పది సినిమాలు సైన్ చేసిన దాఖలాలు లేవు. కాని బేబమ్మ కృతి శెట్టి మాత్రం ఉప్పెన సినిమా తెచ్చిన క్రేజ్ తో పది ఏంటీ అంతకు మించిన సినిమాలను సైన్ చేసింది. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఆమె సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యింది. ఇక ఇటీవల కృతి శెట్టి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కృతి శెట్టి ఉప్పెన సినిమా సమయంలో ప్రమోషన్స్ లో కరోనా ను కూడా లెక్క పెట్టకుండా వైష్ణవ్ తేజ్ తో కలిసి చాలా తిరిగింది. ఆ సమయంలోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో ప్రమోషన్స్ కు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు కదా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషన్ కోసం కూడా నాని మరియు సాయి పల్లవిలతో కృతి శెట్టి చాలా మీడియా సమావేశాలకు హాజరు అయ్యింది. సాయి పల్లవిని మించి టీవీ ఇంటర్వ్యూలు మరియు ఇతర మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆ వారం రోజులు కూడా కృతి శెట్టి ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు బంగార్రాజు కోసం బేబమ్మ చాలా కష్టపడుతుంది.
uppena heroine krithi shetty is very active in movie promotions
నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందింది. నాగ చైతన్య కు జోడీగా నటించిన ఈ అమ్మడు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్కడికైనా.. ఎలాంటి ప్రమోషనల్ వేడుక అయినా హాజరు అయ్యేందుకు సిద్దం అంటుంది. ఇతర హీరోయిన్స్ కండీషన్స్ పెట్టడం లేదంటే ఇబ్బంది పడటం చేస్తారు. కాని ఈమె సినిమా ముందు మరియు తర్వాత యూనిట్ సభ్యులకు చేస్తున్న సపోర్ట్ అందరికి ముచ్చట కలిగిస్తుంది. అందుకే బేబమ్మ రూటే సపరేటు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే బేబమ్మ ఇలా ప్రమోషన్స్ కు సహరిస్తే ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయంటున్నారు. ఈ ఏడాదిని బంగార్రాజు తో మొదలు పెట్టబోతున్న కృతి శెట్టి కనీసం మూడు నాలుగు సినిమాలతో అయినా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.