Nagarjuna : తన భార్య చెప్పినట్లే నాగార్జున వింటాడా.. సమంత సంచలన కామెంట్స్..?

Authored By mallesh | The Telugu News | Published on: January 12, 2022, 8:30 pm

Nagarjuna : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. గతంలోనూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సమంత.. ఇప్పుడూ ఇంకా ఎక్కువ పోస్టులు పెడుతోంది. ప్రొఫెషనల్ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ భామ తాజాగా ‘పుష్ప’ చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ‘ఊ అంటావా మావా’ సాంగ్ సూపర్ హిట్ అయింది కూడా. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంత.. తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..

ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వేదికగా సమంత.. ప్రతీ రోజు బోలెడు పోస్టులు పెడుతోంది. అలా పోస్టులు పెడుతున్న క్రమంలో సమంత.. ఇన్ డైరెక్ట్ గా అక్కినేని ఫ్యామిలీని విమర్శిస్తోందని అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు సమంతపై నెగెటివ్ కామెంట్స్ చేస్తే వారికి దిమ్మదిరిగిపోయే రిప్లయి ఇస్తోంది సమంత. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్త ప్రకారం.. సమంతకు ఇటీవల నాగార్జున కాల్ చేశాడట. కాగా, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే పక్కన పెట్టేసిందని సమాచారం.

samantha comments on Nagarjuna

samantha comments on Nagarjuna

Nagarjuna : నాగార్జునకు అంత సీన్ లేదా..!

ఈ క్రమంలోనే సమంత తన పక్కనున్న ఓ టాలీవుడ్ హీరోతో నాగార్జునకు ఇంట్లో అంత సీన్ లేదని, తన భార్య చెప్పిందే వింటాడని, ఆయనతో మాట్లాడి వేస్టని సమంత అందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అయితే, నిజంగానే సమంత అలా కామెంట్స్ చేసిందా.. లేదా ఇదంతా ఉట్టి ప్రచారమేనా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో అక్కినేని హీరోలు, హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp