Samantha : స‌మంత వ్యాధి థ‌ర్డ్ స్టేజ్‌లో ఉందా.. టెన్ష‌న్ ప‌డుతున్న అభిమానులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : స‌మంత వ్యాధి థ‌ర్డ్ స్టేజ్‌లో ఉందా.. టెన్ష‌న్ ప‌డుతున్న అభిమానులు

 Authored By sandeep | The Telugu News | Updated on :19 November 2022,1:00 pm

Samantha : టాలీవుడ్ హీరోయిన్ స‌మంత రీసెంట్‌గా య‌శోద సినిమాతో మంచి హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కొంచెం ఖుషి, లో కొంచెం బాధలో ఉన్నారు. సమంత ఇటీవల నటించిన యశోద సినిమా సూపర్ హిట్ కావడం వాళ్ల‌ని సంతోష ప‌రుస్తుంటే , మరోవైపు త‌మ అభిమాన హీరోయిన్ మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతూ ఉండటం వారిని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ఆమె త్వ‌రగా కోలుకోవాల‌ని, గ‌తంలో మాదిరిగా స‌ర‌దాగా సంతోషంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.

అయితే స‌మంత ఆరోగ్యం గురించి య‌శోద చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన కల్పిక గణేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సమంత కి మంచి ఫ్రెండ్ అయినా కల్పిక గణేష్ సమంత మయోసైటిస్‌ వ్యాధిలో ఏ స్టేజ్‌లో ఉంది అన్న విషయాన్ని వివ‌రించి అభిమాల‌నుల‌ని ఆందోళ‌న‌కు గురి చేసింది. యశోద సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయ‌గా, ఈ సక్సెస్ మీట్‌కి సమంత హాజరు కాలేదు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కల్పిక గణేష్ సమంతలాగే తాను కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కల్పిక మాట్లాడుతూ ‘‘మేమంతా సమంతని చాలా మిస్ అవుతున్నాం.

samantha disease in third stage

samantha disease in third stage

Samantha : గెట్ వెల్ సూన్

సమంత ఈ మీట్‌కి వస్తున్నారని వీరు నాకు అబద్ధం చెప్పారు. ఆమె వస్తున్నారని తెలిసి నేను పరుగెత్తుకుంటూ వచ్చా. నాకు ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ ఉన్నా కూడా.. వదిలేసి వచ్చా. సమంత‌కి ఉన్న హెల్త్ ఇష్యూ నాకు కూడా గత 13 ఏళ్ల నుంచి ఉండ‌గా, ఇప్పుడు నేను ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నా.. ఆమె (సమంత)ది థర్డ్ స్టేజ్’’ అని చెప్పుకొచ్చింది క‌ల్పిక‌. అయితే ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం ఎవరి దగ్గర కూడా లేదు. బహుశా సమంత సన్నిహితుల దగ్గర ఈ వ్యాధికి సంబంధించిన తెలిసి ఉండవచ్చు. ఇందులో రెండు మూడు రకాలైన ఇబ్బందులు ఉండడంతో సమంత ఎలాంటి ఇబ్బందితో బాధపడుతుందనే విషయంపై ఇప్ప‌టికీ క్లారిటీ లేదు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది