Samantha : అప్పుడు రేణు దేశాయ్‌కి… ఇప్పుడు సమంతకి రెండవ పెళ్లి కష్టాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : అప్పుడు రేణు దేశాయ్‌కి… ఇప్పుడు సమంతకి రెండవ పెళ్లి కష్టాలు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 December 2022,11:40 am

Samantha : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధం ఆయన సమయంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మీరు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే ఉండాలి కానీ మరొకరిని పెళ్లి చేసుకోకూడదు అంటూ కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన హడావుడి అంతా కాదు. అందుకే రేణు దేశాయ్ పెళ్లి నిశ్చితార్థం చేసుకున్న సమయం లో కూడా అతడి పేస్ చూపించలేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల కారణంగా ఆమె తన పెళ్లిని క్యాన్సల్ చేసుకుంది అనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరహాలో నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా సమంత విషయంలో హడావుడి చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య సమంత ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి అక్కినేని అభిమానులతో పాటు కొందరు నానా రచ్చ చేశారు. అతడిని సోషల్ మీడియా లో తీవ్రంగా ట్రోల్ చేస్తూ సమంత తో నువ్వు ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

samantha facing problems like renu desai

samantha facing problems like renu desai

ఆ తర్వాత సమంత ఫ్యాన్స్ రెండవ పెళ్లి గురించి ప్రచారం చేస్తున్న సమయంలో అక్కినేని ఫ్యాన్స్ ఆ పెళ్లి వార్తలను కొట్టి పారేశారు. అదే సమయంలో ఆమె రెండవ పెళ్లి చేసుకోవద్దంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో రేణు దేశాయ్‌కి ఎలా అయితే కొందరి నుండి విమర్శలు వచ్చాయో ఇప్పుడు సమంత కూడా అలాంటి విమర్శలు ఎదుర్కొంటుంది. ఒకవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ఇప్పుడు ఈ ప్రచారంతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది