Samantha : సమంత తండ్రి చేసిన ఆ ఫేస్‌బుక్ పోస్ట్.. చైతూ ని టార్గెట్ చేశాడా!
Samantha : నాగచైతన్య మరియు సమంత వారి వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అందరిని కూడా వేధిస్తున్న ప్రశ్న. గత కొన్నాళ్లుగా ఈ ప్రశ్న అందరిని కూడా వేధిస్తూనే ఉన్నా సమాధానం మాత్రం లభించడం లేదు. కానీ ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానమును ఊహించేసుకుంటున్నారు. ఇదే సమయంలో సమంత తండ్రి అయిన జోసెఫ్ ప్రభు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాస్ ఏ స్టోరీ అంటూ ఆయన ఇంగ్లీషులో ఒక పోస్ట్ పెట్టాడు..
సమంత తండ్రి జోసెఫ్ చేసిన పోస్ట్ అర్థం ఏంటి అంటే… ఒకానొక సమయంలో ఒక కథ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు.. ఆ కథ ఇక ఎప్పటికీ ఉండదు. కనుక ఇప్పుడు కొత్త కథను మొదలు పెట్టాలి, కొత్త చాప్టర్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నాగ చైతన్య అభిమానులతో పాటు అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఉన్నట్లుండి సమంత తండ్రి ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటూ చర్చ జరుగుతున్న ఈ సమయంలో సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏంటి అంటే.. సమంత మరియు నాగచైతన్య కు అధికారికంగా విడాకులు వచ్చాయి. కనుక ఈ సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టాడు అంటూ కొందరు ఊహిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆయన చెప్తే కానీ తెలిసే అవకాశం లేదు..
సమంత లేదా ఆమెకు సంబంధించిన వారు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా లేదంటే మీడియా ముందు మాట్లాడినా కూడా అది నాగ చైతన్యకు లింకు కలిపి ఏదో ఒక రకంగా పుకార్లు షికార్లు చేయడం ఈ మధ్య కాలంలో పరిపాటి అయింది. ఇది ఎంత మాత్రం సరికాదు అంటూ అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య వరుసగా సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఆయన నటించిన థాంక్యూ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకుండా ఒక మంచి సినిమాగా నిలిచింది అంటూ ప్రేక్షకుల నుండి కితాబు దక్కించుకుంది. మరోవైపు ఆయన పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా ను, వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో మొదటగా వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం దర్శకత్వం లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.